Begin typing your search above and press return to search.

మనకే ఎందుకింత బాలీవుడ్ పిచ్చి ?

By:  Tupaki Desk   |   29 May 2019 7:49 AM GMT
మనకే ఎందుకింత బాలీవుడ్ పిచ్చి ?
X
మొన్న సాహో నుంచి తప్పుకుంటున్నట్టు సంగీత ద్వయం శంకర్ ఎహ్సాన్ లాయ్ లు ప్రకటించడం సంచలనంగా మారింది. కారణాలు ఇప్పటిదాకా బయటికి రాలేదు. యువి సంస్థ కూడా థాంక్స్ అని సింపుల్ గా ట్వీట్ చేసిందే తప్ప అంతకు మించి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ పెట్టి మల్టీ లాంగ్వేజ్ లో రూపొందిస్తున్న ఇంత భారీ సినిమా నుంచి సింపుల్ గా సోషల్ మీడియాలో గుడ్ బై చెప్పడం ఏమిటని డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫైర్ అవుతున్నారు.

జిబ్రానో తమనో ఎవరో ఒకరు రీ ప్లేస్ అవుతారు కాని ఇలా చెప్పాపెట్టకుండా చేయడం మాత్రం సమర్ధనీయం కాదు. గతంలో సైరాకు రెహమాన్ ఏవేవో సాకులు చెప్పి తప్పుకున్నాడు. ఎందుకని రెట్టించి అడిగితే టైం లేదన్నాడు. కట్ చేస్తే సైరా డ్రాప్ అయిన రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగైదు కొత్త ప్రాజెక్ట్ లు సైన్ చేశాడు ఇంతా చేసి సైరాకు మళ్ళి బాలీవుడ్ ఫేం అమిత్ త్రివేదినే తీసుకొచ్చారు. అసలు ఈ పరిస్థితి ఎందుకుందని ఒక్కసారి మన దర్శక నిర్మాతలు ఆలోచించాలి.

టాలీవుడ్ లో టాలెంట్ లేదా అంటే టన్నుల్లో ఉంది. మంచి పాటలు బిజిఎం ఇచ్చేవాళ్ళు లేరా అంటే దేవితో మొదలుకుని మణిశర్మ దాకా అందరూ అందుబాటులో ఉన్నారు. కూర్చుని రాబట్టుకోవాలే కాని కోటి లాంటి సీనియర్లు కూడా బ్రహ్మాండమైన అవుట్ పుట్ ఇస్తారు. కాని క్రేజ్ కోసమో పాన్ ఇండియా మార్కెట్ కోసమో మనవాళ్ళు ఇలా డిపెండబుల్ ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా సమస్యలు తెచ్చి పెడుతోంది. ఇకనైనా కాస్త సీరియస్ గా ఈ విషయం మీద దృష్టి పెడితే మంచిది. లేదంటే ఇలాంటి ట్విట్టర్ గుడ్ బైలు భవిష్యత్తులో మరిన్ని చూడాల్సి వస్తుంది