Begin typing your search above and press return to search.

సాహో సయాన్ వస్తోంది - పోస్టర్స్

By:  Tupaki Desk   |   3 July 2019 11:15 AM GMT
సాహో సయాన్ వస్తోంది - పోస్టర్స్
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా సాహో అఫీషియల్ అప్ డేట్స్ మొదలైపోయాయి. నిన్న ప్రకటించినట్టుగానే సాహో టీమ్ ఇవాళ మొదటి ఆడియో సింగల్ కు సంబందించిన రెండు పోస్టర్స్ విడుదల చేసింది. ఒకదాంట్లో డార్క్ గ్రీన్ డ్రెస్ లో శ్రద్ధా కపూర్ కిరాక్ అనిపించేలా ఉండగా మరోదాంట్లో డార్లింగ్ ప్రభాస్ డార్క్ గ్రే జర్కిన్ కాస్ట్యూమ్ లో అదరహో అనిపించేలా ఉన్నాడు.

ఏదో పార్టీ నేపథ్యంలో మంచి డ్యూయెట్ సాంగ్ గా కనిపిస్తున్న ఈ పాట లిరిక్ లో సైకో సయాన్ అని పెట్టడం చూస్తే ఏదో స్పెషల్ మీనింగ్ ఉన్నట్టు తోస్తోంది. సయాన్ అంటే ఓకే కానీ సైకో అన్నారు అంటే ప్రేమ భాషలో విపరీతమైన అని అర్థం చేసుకోవాలేమో. పోస్టర్ లో సంగీత దర్శకుడి పేరు కాని లిరిసిస్ట్ ఎవరు అనే వివరాలు ఇవ్వలేదు. సాంగ్ అవుట్ సూన్ అని ఇచ్చారు కానీ ఎప్పుడు అనే క్లారిటీ లేదు కాబట్టి ఫ్యాన్స్ అది వచ్చేదాకా సస్పెన్స్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఉన్నారు.

నిన్న వర్కింగ్ స్టిల్ ఇవాళ రెండు పోస్టర్ల మొత్తానికి సాహో సందడి చాలా స్పెషల్ గా మొదలైపోయింది. ఇప్పుడీ ఆడియో ట్రాక్ బయటికి వచ్చాక పీక్స్ కు చేరుకోవడం ఖాయం. బాహుబలి నుంచి ఐదేళ్ళ కాలంలో ప్రభాస్ ని కమర్షియల్ సినిమాలో చూడలేకపోయిన అభిమానులకు సాహో విందు భోజనం సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15న విడుదల కానున్న సాహో ట్రైలర్ సైతం ఇదే నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.