Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2 సెన్సార్‌ టాక్‌ అండ్‌ రన్‌ టైమ్‌

By:  Tupaki Desk   |   31 March 2022 10:34 AM GMT
కేజీఎఫ్‌ 2 సెన్సార్‌ టాక్‌ అండ్‌ రన్‌ టైమ్‌
X
కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. కేజీఎఫ్ 1 వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఆ సినిమా లోని యాక్షన్‌ సన్నివేశాలకు మరియు హీరో పాత్రకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు అనడంలో సందేహం లేదు. అంతటి హీరోయిజంను అది కూడా నెగటివ్‌ షేడ్స్ తో చూపించడం కేవలం ప్రశాంత్‌ నీల్ కే సాధ్యం అయ్యింది అంటూ మొత్తం ఇండియన్ సినీ అభిమానులు కామెంట్స్ చేశారు.

ఇప్పుడు కేజీఎఫ్ 2 సినిమా తో అంతకు మించి అంటూ అద్బుతమైన యశ్‌ ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ను ఏప్రిల్‌ 14న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. కేజీఎఫ్ 2 అంతకు కనీసం రెండు లేదా మూడు రెట్ల వసూళ్లు నమోదు చేస్తుందని కన్నడ సినీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సెన్సార్‌ కార్యక్రమాలు ముగించారు. ఈ సినిమా కు యూ/ఎ సర్టిఫికెట్ ను సెన్సార్‌ బోర్డ్ వారు ఇవ్వడం జరిగిందట. ఇక సెన్సార్ బోర్డ్ నుండి ఈ సినిమాకు చాలా పాజిటివ్ గా సినిమా టాక్‌ వచ్చిందని.. అంతే కాకుండా మొదటి పార్ట్‌ తో పోల్చితే ఈ సినిమా లో యాక్షన్‌ సన్నివేశాలు మరింత హై ఓల్టేజ్ తో ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కేజీఎఫ్ 2 సినిమా రన్‌ టైమ్‌ ను 2 గంటల 49 నిమిషాలు గా ఖరారు చేశారు. ఇటీవల విడుదల చేసిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా మూడు గంటలకు పైగా ఉంది. కనుక కేజీఎఫ్ 2 కూడా ఖచ్చితంగా మూడు గంటలు ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేశారు. అదే విధంగా కేజీఎఫ్‌ 2 యొక్క హీరోయిజం సన్నివేశాలు హైలైట్‌ గా ఉంటాయని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

ఈ సమయంలో సినిమా రన్‌ టైమ్‌ ను అనుకున్నట్లుగా కాకుండా కాస్త జాగ్రత్తగానే పావు తక్కువ మూడు గంటలకు నిర్ణయించడం అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ 2 సినిమా లో యశ్‌ కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో సంజయ్ దత్‌.. రావు రమేష్.. రవీనా.. ప్రకాష్ రాజ్ లు నటించారు. ఇండియన్ బాక్సాఫీస్ ను కేజీఎఫ్ 2 కుమ్మేస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది.