Begin typing your search above and press return to search.

టాప్ సీక్వెల్స్ తో నెవ్వ‌ర్ బిఫోర్ ట్రీట్

By:  Tupaki Desk   |   19 Nov 2021 6:34 AM GMT
టాప్ సీక్వెల్స్ తో నెవ్వ‌ర్ బిఫోర్ ట్రీట్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఆర్య‌`..`ఆర్య‌-2` చిత్రాలు ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యాయో తెలిసిందే. ఆర్య‌-3 కూడా ఉంటుందా? హ్యాట్రిక్ కొడ‌తారా? అంటూ అప్ప‌ట్లో అభిమానులు సుక్కూని ప్ర‌శ్నించేవారు. దీనికి ఇటీవ‌లే స్టైలిష్ లాజిక‌ల్ ఫిలింమేక‌ర్ సుకుమార్ స‌మాధానం ఇచ్చారు. `పుష్ప‌-2` త‌ర్వాత‌ `ఆర్య‌-3`కూడా క‌చ్చితంగా ఉంటుంద‌ని..అభిమానుల కోరిక మేర‌కు ఆర్య‌కు పార్ట్ -3 కూడా బ‌న్నీతో తెర‌కెక్కిస్తాన‌ని సుకుమార్ ప్రామిస్ చేసారు.

సుకుమార్ నుంచి వ‌రుస సీక్వెల్ గొప్ప వినోదాన్ని పంచ‌నున్నాయి. బ‌న్నీ-సుకుమార్ `పుష్ప‌`ని రెండు భాగాలు తెర‌కెక్కిస్తుండ‌గా.. మొద‌టి భాగం డిసెంబ‌ర్ లో రిలీజ్ అవుతుంది. అనంత‌రం పార్ట్ -2పై ఎలాంటి అంచ‌నాలు నెల‌కొంటాయ‌న్న‌ది అప్పుడే డిసైడ్ చేయాల్సి ఉంటుది.

ఇక యంగ్ హీరో నిఖిల్ కథానాయ‌కుడిగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన `కార్తికేయ‌`కి సీక్వెల్ గా `కార్తికేయ‌-2` కూడా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ ఉంది. మ‌రోవైపు అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన `కేజీఎఫ్` పాన్ ఇండియా కేట‌గిరీలో పెద్ద‌ సక్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో `కేజీఎఫ్ -2`ని పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇక కోలీవుడ్ హీరో కార్తీ న‌టించిన `ఖైదీ` తెలుగులోనూ పెద్ద స‌క్సెస్ అయింది. లోకేష్ క‌న‌గ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీంతో `ఖైదీ-2` కూడా స‌న్నాహాల్లో ఉంది. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు ఈ విష‌యాన్ని రివీల్ చేసాడు.

స్క్రిప్ట్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని..అతి త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఇక అడ‌వి శేషు హీరోగా వెంక‌ట్ రాంజీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఎవ‌రు` మంచి స‌క్సెస్ అందుకుంది. ఈ సినిమాకి పార్ట్ 2 గా `ఎవ‌రు-2`ని కూడా తెర‌కెక్కించ‌నున్నారు. గూఢ‌చారి సీక్వెల్ ని తెర‌కెక్కించేందుకు శేష్ ప్లానింగ్ తో ఉన్నారు. అలాగే కోలీవుడ్
హీరో శివ‌కార్తికేయ‌న్ న‌టించిన `డాక్ట‌ర్` ఇటీవ‌లే రిలీజ్ అయి డీసెంట్ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సీక్వెల్స్ అన్నీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిత్యం వెబ్ మీడియాలో చ‌ర్చ‌కొస్తున్నాయి.