Begin typing your search above and press return to search.

తొడగొట్టిన ప‌వ‌ర్ స్టార్‌.. నెవ్వ‌ర్ బిఫోర్ స్టంట్స్‌!

By:  Tupaki Desk   |   8 March 2021 8:36 AM GMT
తొడగొట్టిన ప‌వ‌ర్ స్టార్‌.. నెవ్వ‌ర్ బిఫోర్ స్టంట్స్‌!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబోలో రాబోతున్న‌ పీరియాడిక‌ల్ మూవీ.. ప్ర‌తీ విష‌యంలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ హిస్టారిక‌ల్ మూవీ 15వ శ‌తాబ్దం నాటి ప‌రిస్థితులు ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ వ‌జ్రాల దొంగ‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇంకా.. ప‌వ‌న్ కెరీర్లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ చిత్రంగా ఈ మూవీ నిల‌వ‌బోతోంది. దాదాపు 170 కోట్ల వ్య‌యంతో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

పీఎస్‌పీకే27 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక‌, ఈ సినిమాలో ప‌వ‌న్ గెట‌ప్ మ‌రింత అద్భుతంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు స్పెష‌ల్ కేర్ తీసుకుని ప‌వ‌న్ రూపాన్ని డిజైన్ చేశాడ‌ట‌. ఇలా.. ప్ర‌తీ విష‌యంలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మ‌రో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ స్టంట్స్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ప‌లు యాక్ష‌న్ సీన్స్ షూట్ చేశారు. ఇందులో భారీ దేహాలు క‌లిగిన మ‌ల్ల‌యోధుల‌తో ప‌వ‌న్ కుస్తీ ప‌ట్టాడు. అయితే.. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ తొడ గొట్టే సీన్‌, అదేవిధంగా.. మీసం మెలిపెట్టే స‌న్నివేశం గూస్ బంస్ అనే రేంజ్ లో ఉంటాయ‌ట‌.

ఈ విధంగా నెవ్వ‌ర్ బిఫోర్ యాక్ష‌న్ సీన్స్ తో ఫ్యాన్స్ ను అల‌రించ‌బోతున్నార‌ట ప‌వ‌న్. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ఎ.ఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.