Begin typing your search above and press return to search.

ఉప్పెన బ్యూటీని ఎగ‌తాళి చేసిన నెటిజ‌న్

By:  Tupaki Desk   |   20 May 2021 2:30 AM GMT
ఉప్పెన బ్యూటీని ఎగ‌తాళి చేసిన నెటిజ‌న్
X
`ఉప్పెన` చిత్రంతో సెన్సేష‌న‌ల్ డెబ్యూ నాయిక‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది కృతి శెట్టి. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ అయిపోయింది. నాని - శ్యామ్ సింఘా రాయ్.. సుధీర్ బాబు - ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది.. రాపో-16 అనే మూడు చిత్రాలతో అత్యంత బిజీగా ఉంది.

అయితే మ‌రో రెండు ఆఫ‌ర్ల‌ను నిర్ధ‌య‌గా తిర‌స్క‌రించింద‌ని ..ప్యాకేజీ పెద్ద‌గా ఆశించి భంగ‌ప‌డింద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. నిఖిల్ స‌ర‌స‌న ఓ చిత్రం.. అభిరామ్ ద‌గ్గుబాటి-తేజ కాంబినేష‌న్ చిత్రానికి కృతి శెట్టిని సంప్ర‌దించ‌గా తాను చేయ‌లేన‌ని చెప్పింద‌ని ప్ర‌చార‌మైంది. పుకార్లు ప్రబలంగా వైర‌ల్ అవ్వ‌డంతో కృతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరణ ఇవ్వాల్సొచ్చింది.

నా తదుపరి ప్రాజెక్టుల గురించి నేను చాలా పుకార్లు వింటున్నాను. ప్రస్తుతానికి నేను మొత్తం 3 చిత్రాలకు సంతకం చేశాను (ఒకటి నాని గారు.. సుధీర్ బాబు గారు.. రామ్ గారు). ఇప్పుడు నా ఏకైక ఏకాగ్రత నా క‌మిట్ మెంట్లు పూర్తి చేయడమే. నేను నా తదుపరి ప్రాజెక్టులపై సంతకం చేసినప్పుడు క‌చ్చితంగా పోస్ట్ చేస్తాను`` అని వెల్ల‌డించారు.

అయితే ప‌లువురు నెటిజ‌నులు కృతికి సోష‌ల్ మీడియాల్లో ఉచిత స‌ల‌హాలు ఇవ్వ‌డం కంటప‌డింది. మొదట తాను పాఠశాల చ‌దువుల‌పై దృష్టి పెట్టమని కొందరు ముంద‌రికాళ్ల‌కు బంధం వేసే ప్ర‌య‌త్నం చేసారు. కోవిడ్ సీజన్ లో ఆటోమేటిక్ ప్రమోషన్స్ కారణంగా ఈజీగా పాస్ కావచ్చునని కొందరు ఆమెను ఎగతాళి చేశారు. మ‌రి నెటిజ‌నుల కామెంట్ల‌కు కృతి మ‌రోసారి కౌంట‌ర్ వేస్తుందేమో!!