Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న ప్రభాస్ హీరోయిన్ గ్రాఫిక్ పిక్స్..!!

By:  Tupaki Desk   |   23 Dec 2020 4:49 PM GMT
వైరల్ అవుతున్న ప్రభాస్ హీరోయిన్ గ్రాఫిక్ పిక్స్..!!
X
ఢిల్లీ భామ తాప్సి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన సొట్టబుగ్గల సుందరి.. నీవెవరో సినిమా తర్వాత మళ్ళీ తెలుగు వైపు రాలేదు. అమ్మడికి మొదటి నుండి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఉందట. అందుకేనేమో తెలుగు వైపు తిరిగి చూడటం లేదు. అయితే తాప్సి తెలుగులో హిట్ సినిమాలు చాలానే చేసింది. మిస్టర్ పర్ఫెక్ట్, వీర, ఆనందో బ్రహ్మ, గంగ, నీవెవరో సినిమాలతో పాటు వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది. కానీ ఈ వయ్యారి తెలుగులో కంటే హిందీలోనే మంచి గుర్తింపు సాధించింది.

తాప్సి ఇటీవల ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో స్కానింగ్ అని అంటున్నారు. ఎందుకంటే ఆ ఫోటో చూస్తే గ్రాఫిక్ వర్క్ ఏర్పడుతుంది అని నెటిజన్లు చెబుతున్నారు. ఫోటోలో తాప్సిని ఒక్కసారి చూస్తే అది గ్రాఫిక్ పనే అని మనకు క్లారిటీ వస్తుంది. ఇక ఏదేమైనా, తాప్సి సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టీవ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక వ్యాయామ వీడియోలను షేర్ చేస్తుంది. ఇక రీసెంట్ వర్కౌట్ వీడియోలు చూస్తే గనక రాకెట్ రష్మి సినిమాలోని తన పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకొనే ముందు తను ఒక సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది.

ట్రైనింగ్ ప్రారంభించడానికి తాప్సి తన వారికాన్స్ వేయిన్స్ అంటే.. వారికాన్స్ సిరలను తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకుందట. ఫోటోలు చూస్తే తాప్సి చేతులు, కాళ్ళపై కనిపించే వేయిన్స్ తన ముఖం మీద గ్రాఫిక్ లా కనిపిస్తాయి. కానీ, ఆమె శస్త్రచికిత్స వల్ల ఆ మచ్చలు అలా మారాయని చెప్పడానికి వీడియోలే తగిన సాక్ష్యాలు. ఎంతైనా బాలీవుడ్ కి వెళ్ళాక తాప్సి తన పాత్ర కోసం 100% న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. రాకెట్ రష్మీ మూవీలోని పాత్ర కోసం ఆమె శారీరకంగాను, మానసికంగాను సిద్ధమవడం అభినందించాల్సిన విషయం. చూడాలి మరి మళ్ళీ తాప్సి తెలుగులో కనిపిస్తుందేమో..!