Begin typing your search above and press return to search.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా పాట్లు..!

By:  Tupaki Desk   |   16 March 2021 12:30 AM GMT
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా పాట్లు..!
X
ఒక సినిమా విజయంలో సంగీతం మరియు నేపథ్య ముఖ్య భూమిక పోషిస్తుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ - ఎస్.ఎస్. థమన్ హవా నడుస్తోందని చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో పనిలో పనిగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నారు. ఈ విషయంలో ప్రెజెంట్ థమన్ కాస్త ముందున్నాడనే చెప్పుకోవాలి.

థమన్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. తన సంగీతంతోనే సూపర్ హిట్స్ అందిస్తున్న తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' - సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' - కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' - నందమూరి బాలకృష్ణ 'బీబీ3' వంటి పెద్ద సినిమాలకు వర్క్ చేస్తున్నారు. అయితే మ్యూజిక్ ఇచ్చాం మన పని అయిపోయింది అని కాకుండా.. స్టార్ హీరోల సినిమాలకి ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ టీమ్ మెంబర్ గా మారి రెగ్యులర్ గా ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ.. చిట్ చాట్ సెషన్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాకి సరైన ప్రమోషన్స్ జరగడం లేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రానికి అప్డేట్ ఇచ్చే బాధ్యత తీసుకున్న థమన్.. బ్యాగ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ పనులు చూసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అలానే ఎప్పటి నుంచో ఊరిస్తున్న మూడో పాటను కూడా త్వరలోనే విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. అలానే ఈ మధ్య 'సర్కారు వారి పాట' సినిమాకి సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ వస్తున్నాడు థమన్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నాడని నెటిజన్స్ అంటున్నారు.