Begin typing your search above and press return to search.

#బ‌జార్ షూట్: అస‌భ్య‌త‌కు ప‌రాకాష్ట అంటూ సోనమ్ పై ఫైర్

By:  Tupaki Desk   |   2 April 2021 7:00 PM IST
#బ‌జార్ షూట్: అస‌భ్య‌త‌కు ప‌రాకాష్ట అంటూ సోనమ్ పై ఫైర్
X
ప్ర‌ఖ్యాత బ‌జార్ మ్యాగ‌జైన్ 12 వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా బాలీవుడ్ అందాల నాయిక సోన‌మ్ తో క‌వ‌ర్ పేజీ ముఖ‌చిత్రాన్ని ప్ర‌చురించ‌గా అది అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. ఫ్యాష‌నిస్టా సోన‌మ్ నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లు క్ సంచ‌ల‌నంగా మారింది. ఈ ఫోటోషూట్ ఇప్పుడు వివాదాల్లోకి రావ‌డ‌మే గాక‌.. నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొంద‌రు ఇది అస‌భ్య‌త‌కు ప‌రాకాష్ట అంటూ తిట్టి పోస్తున్నారు. సోన‌మ్ విచిత్ర వేష‌ధార‌ణ‌పై ట్రోల్స్ అంత‌కంత‌కు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ప్ర‌ఖ్యాత‌ హార్పర్స్ బజార్ ఇండియా మ్యాగజైన్ 12 వ వార్షికోత్సవ సంచికతో సోనమ్ సెన్సేష‌న్స్ బాలీవుడ్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇలాంటి ట్రోలింగ్స్ సోన‌మ్ కి ఇప్పుడే కొత్త కాదు కానీ.. ఈసారి ట్రోలింగ్ మ‌రో లెవల్లో క‌నిపిస్తోంది.

సోన‌మ్ కెరీర్ లోనే ఇంత‌కుముందు చూడ‌ని బోల్డ్ ఫోటోషూట్ ఇది. ఫోటోషూట్ లో బెస్పోక్ లుక్స్ ఛ‌మ‌త్కార‌మైన‌ మెటాలిక్ కనుబొమ్మల తీరు వింత‌గా క‌నిపిస్తోంది. మ‌రియా అస‌దీ మేక‌ప్ అందించ‌గా.. డామియ‌న్ ఫోక్సే.. ఎలాడ్ బిట్ట‌న్ లాంటి ప్ర‌ముఖులు ఈ ఫోటోగ్ర‌ఫీ స్టైలింగ్ వెన‌క ఉన్నారు. సిల్క్ డ‌చెస్ సాటిన్ డ్రెస్.. ట్రౌజ‌ర్స్.. రెజిన్ బీడ్ ట్రాంపే లోయిల్ ఇయ‌ర్ రింగ్స్.. మ్యాచింగ్ గ్లాసెస్ ని సోన‌మ్ ధ‌రించింది. సోనమ్ లుక్ ఎంతో స్పెష‌ల్ గా ఉన్నా ఎక్స్ పోజింగ్ మ‌రో లెవ‌ల్లో ఉండ‌డంతో ట్రోల్స్ త‌ప్ప‌లేదు. ``చమత్కారంగా కనిపిస్తోంది ..... ఇది గ్రహాంతర ప్రపంచానికి చెందినది అనిపిస్తోంది`` అని ఓ వ్య‌క్తి వ్యాఖ్య‌ను జోడించారు.

అయితే నెటిజ‌నుల కామెంట్ల‌ను ప‌ట్టించుకునే పరిస్థితిలో సోన‌మ్ ఎప్పుడూ ఉండ‌రు. ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ,.. తాను ఎప్పుడూ ఇతరుల్లా దుస్తులు ధరించాలని అనుకోనని అన్నారు. ఎందుకంటే త‌న‌దైన‌ స్టైల్ స్టేట్మెంట్ వ్యక్తిత్వం స్వీయ వ్యక్తీకరణ పూర్తిగా వేరే అని చెబుతారు.

నేను నేనే కావడం.. నన్ను నేను వ్యక్తపరచడం నాకు ఇష్టం. ఇతరులకు డ్రెస్సింగ్ లేదా ఒకరి అభిప్రాయం కోసం డ్రెస్సింగ్ చేయడంపై నాకు అస‌లు ఎలాంటి నమ్మకం లేదు. ఇది నా కోసం.. నా వ్యక్తిత్వం.. నా స్వీయ వ్యక్తీకరణ అని వ్యాఖ్యానించారు. సావారియా- దిల్లీ 6- భాగ్ మిల్కా భాగ్ స‌హా ఎన్నో చిత్రాల్లో ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించిన సోన‌మ్ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో విల‌క్ష‌ణ‌తను చాటుకుంటున్నారు.

ప్ర‌స్తుతం థ్రిల్లర్ మూవీ `బ్లైండ్` షూటింగ్ ని పూర్తి చేశారు. సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షోమ్ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ థ్రిల్లర్ లో సోనమ్ బ్లైండ్ పర్సన్ పాత్రలో న‌టిస్తున్నారు. సీరియల్ కిల్లర్ కోసం వెతుకుతున్న అంధ పోలీసు అధికారి చుట్టూ క‌థాంశం తిరుగుతుంది. వినయ్ పాథక్- పురబ్ కోహ్లీ -లిలెట్ దుబే త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం 2011 లో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం బ్లైండ్ ఆధారంగా రూపొందుతోంది.