Begin typing your search above and press return to search.
#CDP వివాదం.. రౌడీ బేబి లైట్ తీస్కుందే
By: Tupaki Desk | 24 Dec 2020 5:00 PM ISTఈగోలకు పోతే గొడవలవుతాయి! అలా కాకుండా సామరస్యంగా వెళితే ఇట్టే సాల్వ్ అయిపోతుంది సమస్య. అంతా మన చేతిలోనే ఉంటుంది. ఈ సందర్భంలో రౌడీ బేబి సాయి పల్లవి స్పందించిన తీరు ఎంతో సామరస్యంగా ఉందనే చెప్పాలి. ఇంతకీ ఏమిటా గొడవ అంటే..
ధనుష్ - సాయి పల్లవి జంటగా నటించిన `మారి`లోని `రౌడీ బేబి` గీతం బిలియన్ వీక్షణలతో సంచలనం సృష్టించగా.. ఆ మూవీ పోస్టర్ సీడీపీని అభిమానులు వైరల్ చేశారు. అయితే ఈ సీడీపీలో సాయి పల్లవి ఎక్కడా కనిపించకపోవడం వివాదానికి తావిచ్చింది.
అసలు ఆ పాటకు అంత మైలేజ్ వచ్చిందే సాయిపల్లవి ట్యాలెంట్ వల్ల. అలాంటిది తనను లైట్ తీస్కుంటారా? అంటూ ఫ్యాన్స్ వీరంగమాడారు. ధనుష్ నిర్మాణ సంస్థను దునుమాడారు. ఇదే విషయం సాయిపల్లవి దృష్టికి తీసుకుని వస్తే .. దానిని చాలా తేలికగా తీసుకొని ధనుష్ బృందానికి మద్దతు ఇచ్చింది. ఇది అభిమాని తయారు చేసిన సీడీపీ. దానినే వుండర్ బార్ ఫిల్మ్స్ బృందం ఉపయోగించుకుని తమ సోషల్ మీడియా వాల్ పై పోస్ట్ చేసిందని ఆమె అన్నారు.
కానీ ఇది అధికారిక పోస్టర్ కాబట్టి అలా ఉండకూడదనేది అభిమానుల వెర్షన్. ధనుష్ నాకు ఫోన్ చేసి ఇదే విషయాన్ని నాతో పంచుకున్నారు. వారు కూడా ఆనందించారు అని సాయి పల్లవి చెప్పారు. CDP లో ఆమె పేరు లేదా ఆమె ఫోటోను జోడించనందుకు వివాదం చెలరేగిన వైనం చూస్తుంటే తాను ఎందుకిలా కవర్ చేసేస్తోంది! అంటూ ఇంకా సందేహం వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు. క్రెడిట్ ఒకరే కొట్టేయడం ఎవరికీ నచ్చడం లేదు.