Begin typing your search above and press return to search.

స్టాక్ ఎక్స్ఛేంజ్ నే వైర‌స్ లా ఒణికించిన మౌనీ!

By:  Tupaki Desk   |   11 Jan 2021 2:00 PM IST
స్టాక్ ఎక్స్ఛేంజ్ నే వైర‌స్ లా ఒణికించిన మౌనీ!
X
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) కి చెందిన ట్విట్ట‌ర్ స‌డెన్ షాక్ ఇచ్చి అంత‌లోనే తేరుకున్న ఘ‌ట‌న తాజాగా హాట్ టాపిక్ గా మారింది. ఎంతో సెన్సిటివ్ గా ఉండే మార్కెట్ వ్య‌వ‌హారం కావ‌డంతో ఇది `హ్యూమన్ ఎర్రర్` అని స‌రిపెట్టుకో‌లేని పరిస్థితి. అస‌లింత‌కీ ఏం జ‌రిగింది? అంటే... శనివారం నాడు ఎన్.‌ఎస్.‌ఇ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హాటీ మౌని రాయ్ ఫోటోల్ని పోస్ట్ చేసి దానికి వేడెక్కే కామెంట్ ని జోడించింది. ``శనివారం హీట్ అధికంగా ఉంది…రాయ్ ‌మౌని ఎగ్జ‌యిటింగ్ గా కనిపిస్తోంది`` అన్న వ్యాఖ్య వైర‌ల్ అయ్యింది. దీనికి సెక్సీ దివా.. బ్యూటిఫుల్ దివా.. హాట్ గాళ్.. అర్బ‌న్ ఆసియ‌న్ వంటి హ్యాష్ ట్యాగ్ లు వైర‌ల్ అయ్యాయి.

ఇది ఊహించ‌ని ప‌రిణామం కావ‌డంతో నెటిజ‌నుల్లో ట్రోలింగ్ స్టార్ట‌య్యింది. మౌని రాయ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్విట్టర్ హ్యాండిల్ లో కనిపించడం చూసి మార్కెట్ ఫాలోవ‌ర్స్ చాలామంది షాక్ అయ్యారు. త‌ప్పు ఏం జ‌రిగిందో అర్థం గాక‌ ఆశ్చర్యపోయారు. ఆ పోస్ట్ స‌డెన్ గా ప్ర‌త్య‌క్ష‌మై వైరల్ కావడంతో ఎన్‌.ఎస్.ఇ అప్రమత్తమై దాన్ని తొలగించింది.

జ‌రిగిన త‌ప్పిదంపై ఎన్‌.ఎస్‌.ఇ ట్వీట్ లో వివ‌ర‌ణ ఇచ్చింది. “ఈ రోజు మధ్యాహ్నం 12:25 గంటలకు ఎన్.ఎస్.ఇ హ్యాండిల్ పై అవాంఛిత పోస్ట్ ఉంది. ఇది ఎన్.ఎస్.ఇ ఖాతాను నిర్వహించే ఏజెన్సీ చేసిన మానవ తప్పిదం. ఎలాంటి హ్యాకింగ్ లేదు. అసౌకర్యానికి మా ఫాలోవ‌ర్స్ కి హృదయపూర్వక క్షమాపణలు`` అని తెలిపారు. అయితే అప్పటికే జ‌ర‌గాల్సిన‌ నష్టం జరిగిపోయింది. నెటిజనులు ఎన్‌.ఎస్.ఇ ట్విట్టర్ హ్యాండిల్ ‌ను దారుణంగా ట్రోల్ చేశారు.

దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ మౌనీరాయ్ స్పందించనే లేదు. ఇటీవలి కాలంలో మౌని తన బికినీ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో వేడి పెంచుతోంది. మౌనీ మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు హీట్ పెంచాయి. ఇప్పుడు ఏకంగా స్టాక్ ఎక్స్ ఛేంజీలోనే త‌న బికినీ వైర‌ల్ అవ్వ‌డంతో అభిమానులు ఖంగు తిన్నారు. ఒక ర‌కంగా స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ని వైర‌స్ లా ఒణికించింది మౌనీ. జీ5 సిరీస్ లండ‌న్ కాన్ఫిడెన్షియ‌ల్ లో మౌనీ న‌టించింది. త‌దుప‌రి బ్ర‌హ్మాస్త్రలోనూ త‌ళుక్కున మెరిసే పాత్ర‌లో న‌టించింది.