Begin typing your search above and press return to search.

బిబి4 : ఆమె తన్నిందన్న అవినాష్‌ పై దారుణ ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:43 AM IST
బిబి4 : ఆమె తన్నిందన్న అవినాష్‌ పై దారుణ ట్రోల్స్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ మరో రెండు వారాల్లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్‌ మరింత ఎఫర్ట్‌ పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో చావో రేవో అన్నట్లుగా పోటీ పడాలి. ఒకరిపై ఒకరు యుద్దం తరహాలో టాస్క్‌ లో విరుచుకు పడాలి. ఆ ఉద్దేశ్యంతోనే ఫినాలే మెడల్‌ టాస్క్‌ ను బిగ్‌ బాస్‌ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. ఆ టాస్క్‌ లో ప్రాణం పెట్టి మరీ పోరాడాలంటూ క్లియర్‌ గా చెప్పాడు. దాంతో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్‌ మొదట చాలా గట్టిగా ఆడినట్లుగా అనిపించింది. అయితే అవినాష్‌ కాస్త చిరాకు పడ్డాడు. నామినేషన్‌ లో ఉన్న విషయం తట్టుకోలేక పోవడంతో పాటు తనను మోనాల్‌ టార్గెట్‌ చేయడాన్ని తట్టుకోలేక పోయాడు. ఆ ఉద్దేశ్యమో లేదా మరేంటో కాని పాల టాస్క్‌ లో ఆమెను టార్గెట్‌ చేశాడు.

ఆమెపై ఉన్న కోపంతో టాస్క్‌ లో భాగంగా కాలు తలిగినా కూడా కాస్త ఎక్కువ చేశాడు. ఆమె కనీసం కాలు తలగలేదు అంటోంది. కాని అవినాష్ మాత్రం కాలు తలిగింది. కాలు తీయమని అన్నా కూడా ఆమె నవ్వింది అంటూ రచ్చ చేసే ప్రయత్నం చేశాడు. టాస్క్‌ లో భాగంగా ప్రాణం పెట్టమన్నప్పుడు తన్నడం ఏంటీ ఇంకా ఏమైనా చేయవచ్చు. మోనాల్‌ అదే చేసింది అనుకోవాలి. అంతే తప్ప ఆమె తన్నింది అంటూ ఫిర్యాదు చేస్తూ టాస్క్‌ లో పాల్గొనను అంటూ పక్కకు తప్పుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మోనాల్‌ పై కోపంతో పక్కకు తప్పుకున్నట్లుగా చెప్పిన అవినాష్ ఆ తర్వాత తన డబ్బాలో నీళ్లు మరీయు పాలను పోశాడు. ఆయన బాటిల్స్‌ ఎక్కువ అయ్యాయి. అయితే బిగ్‌ బాస్‌ కేవలం ఆవు నుండి వచ్చే పాలను మాత్రమే కౌంట్‌ చేస్తామని చెప్పడంతో మొదటి రౌండ్‌ లోనే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అవినాష్‌ తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఫన్నీ మీమ్స్‌ అతడిపై దారునంగా పోస్ట్‌ అవుతున్నాయి. నామినేషన్‌ లో ఉంటే ఎందుకు ఇంతగా భయపడుతున్నావు.. నీ కష్టం నువ్వు పడితే నీకు దక్కాల్సింది దక్కుతుంది కదా అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున కూడా వీకెండ్‌ లో అవినాష్ ను టార్గెట్‌ చేసే అవకాశం ఉందనిపిస్తుంది. ఈ దెబ్బతో అవినాష్ బయటకు వెళ్లడం ఖాయం అనిపిస్తుంది.