Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : వంట విషయంలో కాజల్ అడ్డంగా బుక్‌

By:  Tupaki Desk   |   11 Sep 2021 7:30 AM GMT
#BIGGBOSS5TELUGU : వంట విషయంలో కాజల్ అడ్డంగా బుక్‌
X
బిగ్ బాస్ ను కాచి వడగట్టి వచ్చాను.. ఎలా ఉంటే జనాల్లో గుర్తింపు తెచ్చుకోవచ్చు అనే విషయాలను అర్థం చేసుకుని వచ్చాను అంటూ చెప్పుకుంటున్న ఆర్‌జే కాజల్ తాజా ఎపిసోడ్ లో తనకు వంట రాదు.. అసలు కిచెన్ లోకి వెళ్లను అన్నట్లుగా తేల్చి చెప్పేసింది. కనీసం అంట్లు కూడా కడిగేందుకు నేను ఒప్పుకోను అని... ఇతర పనులు ఏం చెప్పినా కూడా నేను సిద్దమే అని.. జీవితంలో నేను ఎప్పుడు కూడా వంట చేసిన దాఖలాలు లేవు అంటూ చెప్పింది. ఆ సమయంలో శ్రీరామ చంద్ర నేను కూడా ఎప్పుడు వంట ఇల్లు చూసిందే లేదు. అయినా కూడా ఎవరికి తోచిన పనులు.. ఎవరికి వచ్చిన పనులు వారు చేస్తున్నారు కదా అంటూ చెప్పిన సమయంలో నేను మాత్రం వంట గదిలో అడుగు పెట్టను అన్నట్లుగా తెగేసి చెప్పింది. వంటలో హెల్ప్‌ చేయదు కాని పెత్తనం చేసే విషయంలో మాత్రం ఎప్పుడు ముందు ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటిసభ్యుల్లో కూడా ఇప్పటికే కొందరు ఆమె తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

తనకు కిచెన్‌ అలవాటు లేదు.. ఎప్పుడు కూడా కిచెన్ లో అడుగు పెట్టిందే లేదు అంటూ ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఏ ఒక్కరు కూడా అబద్దం చెప్పి మనుగడ సాగించలేరు. కాజల్‌ కిచెన్ లో ఎప్పుడు అడుగు పెట్టలేదు అనడంతో ఆమె వంట చేస్తున్న వీడియోలను నెటిజన్స్ షేర్‌ చేసి ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఎంచక్క మిర్చిలు చేస్తున్న వీడియో లో కాజల్‌ కనిపించింది. అంతే కాకుండా ఇతర వంటకాల విషయంలో కూడా కాజల్ చాలా చురుకుగా ఉన్నట్లుగా వీడియోలు ఉన్నాయి. ఆమె సోషల్‌ మీడియా అకౌంట్ లోనే ఆ వీడియోలను నెటిజన్స్ చూపిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. కిచెన్‌ లో ఎక్కువ సమయం ఉంటే కెమెరా ముందు తక్కువ ఎక్స్ పోజ్‌ అయ్యే అవకాశం ఉందని.. అందుకే ఆమె కిచెన్‌ టీమ్‌ లో ఉండాలని అనుకోవడం లేదని కొందరు ఊహిస్తుంటే మరి కొందరు మాత్రం పని తప్పించుకోవడం కోసం ఆమె ఈ మాటలు అన్నది అంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి బిగ్‌ బాస్‌ హౌస్‌ లో కిచెన్ లోకి వెళ్లను అంటున్న కాజల్ గతంలో కిచెన్‌ లో చేసిన విన్యాసాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల లోబో తనకు బిగ్ బాస్ సెట్ అవ్వదు అంటూ వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రెండేళ్ల క్రితం బిగ్‌ బాస్ లో పాల్గొంటారా అన్నప్పుడు అది నాకు సెట్‌ అవ్వదు అంటూ లోబో చేసిన వ్యాఖ్యలు అవి. కంటెస్టెంట్స్ ఏ విషయంలో కాస్త అటు ఇటు అయినా కూడా వారిని ఏకి పారేసేందుకు గాను నెటిజన్స్ రెడీగా ఉంటున్నారు. కనుక ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ జాగ్రత్తగా ఉంటే మంచిది. సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ గురించి కొన్ని వందల కొద్ది పోస్ట్‌ లు ట్వీట్ లు వస్తున్నాయి. ఏ సమయంలో ఎవరు దొరుకుతారా అంటూ కొందరు మీమర్స్ ఎదురు చూస్తూ ఉంటే.. కొందరు మాత్రం ట్రోల్స్ చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉంటున్నారు. ఈసారి కాజల్ అడ్డంగా బుక్ అయ్యింది. ఆమె ముందు ముందు అయినా కిచెన్‌ టీమ్‌ లో అడుగు పెడుతుందేమో చూడాలి.