Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ OTT లో టాప్ లేపిన బ్యూటీ ఏంటిలా?

By:  Tupaki Desk   |   9 Sep 2021 4:30 AM GMT
బిగ్ బాస్ OTT లో టాప్ లేపిన బ్యూటీ ఏంటిలా?
X
బుల్లితెర‌పై బిగ్ బాస్ ఒక సంచ‌ల‌నం కాగా.. ఇటీవ‌ల ఓటీటీ- బిగ్ బాస్ కూడా అంత‌కుమించి పాపుల‌ర‌వుతోంది. తాజాగా ఓటీటీ- బిగ్ బాస్ తో పాపుల‌రైన ఉర్ఫీ ఇదిగో ఇలా ప‌బ్లిక్ లో చెల‌రేగిపోతోంది. విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌ప‌డుతూ ఈ అమ్మ‌డు ఇచ్చిన ఫోజుల‌కు కుర్రాళ్ల గుండె ఝ‌ల్లుమంది. టాప్ టు బాట‌మ్ బ్లూ డెనిమ్స్ లో ప్ర‌త్య‌క్ష‌మైనా ఆ పింక్ బ్రాని హైలైట్ చేస్తూ డిజైనర్ లుక్ లో క‌నిపించి మ‌తులు చెడ‌గొట్టింది ఉర్ఫీ. బ్రాతోనే బజారులో ఇలా చేస్తుందా? అంటూ దీనిపై నెటిజెనులు ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. అస‌లింత‌కీ ఉర్ఫీ జావెద్ బిగ్ బాస్ లో కొన‌సాగుతోందా? అంటే.. డీటెయిల్స్ లోకి వెళ్లాలి.

బిగ్ బాస్ ఓటీటీ నిజంగానే `ఓవర్ ది టాప్` అనే కాన్సెప్ట్ కి సరిపోతుంది. ఇటీవ‌లే ఈ సిరీస్ ఓటీటీలో మొద‌లైంది. తొలి సీజన్ లో కంటెస్టెంట్ లు ఏమి ధరిస్తున్నారు వారు ఏం మాట్లాడుతున్నారు? అన్న‌ దానిపై ఎలాంటి ఫిల్టర్ లేదు! కరణ్ జోహార్ హోస్ట్ గా కొన‌సాగుతున్న‌ షో నుండి ఎలిమినేట్ అయిన మొదటి పోటీదారు ఉర్ఫీ జావేద్. ఉర్ఫీ త‌న‌దైన అందం గ్లామ‌ర‌స్ ఎలిమెంట్స్ తో టీవీక్ష‌కుల్ని క‌ట్టి పడేసింది. ఇక ఉర్ఫీ స్పీడ్ ని త‌ట్టుకోలేక‌ ఫైనల్ ఎపిసోడ్‌లో మేకర్స్ ఒక ముఖ్య‌మైన షాట్ ని కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ షోలో దివ్యా అగర్వాల్ తో జతకట్టడానికి జీషన్ ఖాన్ ఆమెతో కనెక్షన్ ను విచ్ఛిన్నం చేసినప్పుడు ఉర్ఫీ డంపింగ్ జోన్ కు వెళ్లే ఎపిసోడ్ హైలైట్ అయ్యింది. ఆ తర్వాత 45 నిమిషాల పాటు ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా నటించి తనను తాను రక్షించుకునే అవకాశం నటికి లభించింది. ఈ సంభాషణ సమయంలో ఆమె సీన్లు క‌ట్ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఓ వీడియో అంత‌ర్జాలంలో వైరల్ అవుతోంది, ఇక్కడ ఉర్ఫీ జావేద్ మాట్లాడుతూ, "జైసే కి మైనే ఆప్కో బటయా కి యహ s*x హో చుక్కా హై, బిగ్ బాస్ OTT కే ఘర్ నాకు. పటా నహీ ఆప్కో దిఖాయ గయా హోగా కి నహీ! కెమెరాలో పర్ యహ s*x హో చుక్కా హై !! " అంటూ హిందీలో మాట్లాడుతోంది ఉర్ఫీ.

ఇది విన్న తరువాత‌ ప్రతీక్ సెహజ్ పాల్ అంతరాయం కలిగించారు. వారి సంభాష‌ణ‌లు హ‌ద్దు మీర‌డం యూత్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంతలో బిగ్ బాస్ OTT నుండి ఉర్ఫీని తొలగించడం గురించి నిజంగా నిరాశ చెందింది. ఆమె బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో జీషన్ ఖాన్ - దివ్య అగర్వాల్‌పై ఆమె నిప్పులు చెరిగారు.