Begin typing your search above and press return to search.
జూనియర్ పూరి అడ్డంగా బుక్ అయ్యాడు
By: Tupaki Desk | 25 July 2020 8:00 AM ISTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి చిన్నప్పటి నుండే సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా కూడా చేస్తున్నాడు. మెహబూబా చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారిన ఆకాష్ పూరి తాజాగా రొమాంటిక్ అనే చిత్రంతో వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. త్వరలో తన పుట్టిన రోజు రాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆకాష్ ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ.. మన క్షేమం కోసం పుట్టిన రోజు వేడుకకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కావున మీరు ఎలాంటి సన్నాహాలు చేయకండి. మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఎప్పటి మాదిరిగానే కలుసుకుందాం. భౌతిక దూరం పాటించి జాగ్రత్తగా ఉండాలంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
ఆకాష్ పూరి చేసిన ట్వీట్ ట్రోల్ అవుతుంది. నువ్వేమన్న స్టార్ హీరో అనుకుంటున్నావా నీ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ముందస్తు ఏర్పాట్లు చేయడానికి అంటూ ఎద్దేవ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ఎన్నో పోస్ట్ చేస్తూ ఆకాష్ ను ట్రోల్స్ చేస్తున్నారు. మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు అంటూ ఆకాష్ ను ఉద్దేశించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరు జిఫ్ ఇమేజ్ లతో కూడా సరదాగా ఆకాష్ పోస్ట్ ను ట్రోల్స్ చేస్తున్నారు.
మొత్తానికి బర్త్ డే వేడుకలు వద్దంటూ అభిమానులకు సందేశం ఇవ్వడంతో ఆకాష్ పూరి అడ్డంగా బుక్ అయ్యాడు. ఉన్న అంత మంది అభిమానులకు ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అది కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసారి వద్దంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ పెట్టారు. కొందరు మాత్రం మీ బర్త్ డే ఈసారి జరుపుకోక పోవడం మాకు నిరాశగా ఉందని కామెంట్స్ పెట్టారు.