Begin typing your search above and press return to search.

స‌మంత బాలీవుడ్ ప్లానింగ్ మామూలుగా లేదే?

By:  Tupaki Desk   |   1 Jan 2022 12:30 AM GMT
స‌మంత బాలీవుడ్ ప్లానింగ్ మామూలుగా లేదే?
X
నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత వేగం మ‌రింత పుంజుకున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ తో పాటు...బాల‌వుడ్ లోనూ సినిమాలు చేస్తోంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే తెలుగు సినిమాల క‌మిట్ మెంట్ గురించి క్లారిటీ ఉందిగానీ..బాలీవుడ్ లో ఏఏ సినిమాలు చేస్తుంది? అన్న దానిపై మాత్రం అస్ప‌ష్ట‌తే ఉంది. తాజాగా స‌మంత మాట‌ల్ని బ‌ట్టి ఆమె క‌మిటె మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధ‌మ‌వుతోంది. స‌మంత ఇప్ప‌టివ‌రకూ కేవ‌లం ద‌క్షిణాది చిత్రాల‌పైనే మ‌న‌సు పెట్టి ప‌నిచేసింది. దీనిలో భాగంగానే తెలుగు..త‌మిళ్ లో ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు అగ్ర హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి త‌న‌కంటూ ఓ గుర్తింపు ను ద‌క్కించుకుంది.

అయితే గ‌త రెండేళ్ల‌లో న‌టిగా త‌న‌లో చాలా మార్పులు వ‌చ్చాయని స‌మంత తెలిపింది. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం స‌రిగం్గా ఉండ‌ద‌నే భావ‌న‌తోనే ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాలు చేయ‌లేద‌ని..ఇక‌పై మాత్రం ఏకాగ్ర‌త అంతా హిందీ సినిమాల‌పైనే ఉంటుంద‌ని తెలిపింది. తాను ఎంపికలు ఇప్ప‌టికీ రాంగ్ డెసిష‌న్ లో ఉన్నాయ‌ని.. అయితే వెండి తెర‌పై డీగ్లామ‌ర్ పాత్ర‌లు పోషించ‌డానికి మాత్రం ఎప్పుడు సిద్దంగా ఉండ‌న‌ని తెలిపింది. ఇప్పుడు కొత్త స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డానికి రెడీగా ఉన్నాను. నామీద నాకు న‌మ్మ‌కం ఉంది. ఒకేసారి చాలా విష‌యాల్లో మునిగిపోను. ఒక ఛాలెంజ్ లో విజ‌యం సాధించిన త‌ర్వాత మ‌రో దాని గురించి ఆలోచిస్తాను.

అందుకే హిందీ చిత్ర సీమ‌లోకి అడుగు పెట్ట‌డానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని స‌మంత తెలిపింది. మొత్తానికి సామ్ బాల‌వుడ్ ఎంట్రీ షురూ అయింది. అయితే ప్రాజెక్ట్ వివ‌రాలు మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. తాప్సీ నిర్మాణ సంస్థ‌లో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రం చేయ‌బోతుంద‌ని టాక్ వినిపిస్తోంది. కానీ ఇంకా ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ ధృవీక‌రించ‌లేదు. అయితే స‌మంత బాలీవుడ్ లో `ఏ మాయ చేసావే` రీమేక్ తో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. `ఏక్ దీవానా తా` టైటిల్ తో దీన్ని మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించారు.