Begin typing your search above and press return to search.

ర‌ష్మిక ఆ పూజ‌లెందుకు చేయించింది?

By:  Tupaki Desk   |   23 Dec 2021 6:35 AM GMT
ర‌ష్మిక ఆ పూజ‌లెందుకు చేయించింది?
X
టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ప‌ర భాషా హీరోయిన్ ల‌తో పోలిస్తే క‌న్న‌డ సోయ‌గం, నేష‌న్ క్ర‌ష్ గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్న జ‌ర్నీ చాలా ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించి అల‌రించే ర‌ష్మిక `ఛ‌లో` సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. తొలి ఎంట్రీనే గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్పిన‌ట్టుగా ఈ సినిమా భారీ విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా `ఎవ‌రీ పిల్లా... భ‌లే వుందే` అని స‌గ‌టు ప్రేక్ష‌కుడితో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఆమెని ఓన్ చేసుకునేలా చేసింది.

ప్ర‌స్తుతం వరుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా గ‌డిపేస్తున్న ర‌ష్మిక ఓ వివాదాస్ప‌ద స్వామితో క‌లిసి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేయడం ద‌క్షిణాదిలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో హీరోయిన్ గా అన‌తి కాలంలోనే క్రేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మిక ఆ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే టాలీవుడ్ లో క్రేజీ ఆఫ‌ర్లు ద‌క్కించుకోవ‌డం మొదలుపెట్టింది. `ఛ‌లో` హిట్ తో టాలీవుడ్ లో పాగా వేసి ర‌ష్మిక ఆ వెంట‌నే రౌడీ హీరోతో చేసి `గీత గోవిందం` బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి ఏకంగా ర‌ష్మిక‌ని వంద కోట్ల క్ల‌బ్ లో చేర్చింది.

దేవ‌దాస్‌, డియ‌ర్ కామ్రేడ్ వంటి వ‌రుస చిత్రాల‌తో ఇండస్ట్రీ వ‌ర్గాల దృష్ట‌ని ఆక‌ర్షించింది. అదే ఆమెకు సూప‌ర్ స్టార్ ప‌క్క‌న `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో న‌టించేలా చేసింది.తాజాగా బ‌న్నీ స‌ర‌స‌న పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`లో న‌టించి శ్రీ‌వ‌ల్లిగా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటోంది. అయితే ర‌ష్మిక ఇలా ఎద‌గ‌డానికి ఆమె హార్డ్ వ‌ర్క్ తో పాటు ఆమె న‌మ్మే దైవ‌బ‌ల‌మే అని అంటున్నారు. ఇటీవ‌ల ఆమె ఓ వివాదాస్ప‌ద స్వామితో ర‌హ‌స్యంగా జ‌రిపించిన పూజ‌లే ఇందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక చేసిన ప్ర‌త్యేక పూజ‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

వివ‌దాదాస్ప‌ద స్వామిగా పేరున్న వేణు స్వామితో ర‌ష్మిక మంద‌న్న చేయించిన ప్ర‌త్యేక పూజ‌ల‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. స‌మంత‌, చై విడాకుల గురించి ముందే చెప్పి సంచ‌ల‌నం సృష్టించిన వేణు స్వామి వార్త‌ల్లో నిలిచారు. అంత‌కు ముందు జ‌గ‌న్ 15 ఏళ్ల పాటు సీఎంగా కొన‌సాగుతార‌ని చెప్పిన ఆయ‌న స‌మ‌క్షంలో ర‌ష్మిక ప్ర‌త్యేక పూజలు చేయ‌డం వెన‌కున్న అస‌లు మ‌త‌ల‌బు ఏంట‌ని అంతా ఆరా తీస్తున్నారు.

ర‌ష్మిక మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. త‌న పూజ‌ల వెన‌కున్న అస‌లు ర‌హ‌సాన్ని బ‌య‌ట‌పెట్ట‌క పోవ‌డంతో ర‌ష్మిక ప్ర‌త్యేక పూజ‌లు కెరీర్ కా.. లేక పెళ్లికా.. అన్న‌ది మాత్రం తెలియాల్సి వుంది. `పుష్ప‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో మంచి జోష్ మీదున్న ర‌ష్మిక వ‌చ్చే ఏడాది ఇదే జోష్ తో బాలీవుడ్ లో హంగామా చేయ‌డానికి రెడీ అవుతోంది.

ఇప్ప‌టికే ఆమె హీరోయిన్ గా బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న `మిష‌న్ మ‌జ్ను` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇక అమితాబ్ బ‌చ్చ‌న్ తో క‌లిసి చేస్తున్న `గుడ్‌బై` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ రెండు బాలీవుడ్ లో ర‌ష్మిక భ‌విత‌వ్యాన్ని తేల్చ‌నున్నాయి. బాలీవుడ్ లో త‌న కెరీర్ సాఫీగా సాగి త‌న‌కు దేశ వ్యాప్తంగా పేరు రావాల‌న్న కోరిక వ‌ల్లే ర‌ష్మిక ప్ర‌త్యేక పూజ‌లు చేయించిందా? అని మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది.