Begin typing your search above and press return to search.

పందెంకోడి కొత్తగా భలే ఉన్నాడే

By:  Tupaki Desk   |   3 Jan 2022 8:30 AM GMT
పందెంకోడి కొత్తగా భలే ఉన్నాడే
X
తమిళ స్టార్‌ హీరో విశాల్ తెలుగు లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆయన నటించిన పలు సినిమా లు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఈమద్య కాలంలో ఆయన సినిమాలు టాలీవుడ్‌ లో కాస్త సందడి చేయలేక పోతున్నాయి. అయినా కూడా ఆయన నటించే ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేసేందుకే మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న సినిమాల కంటే త్వరలో నటించబోతున్న అధిక్ రవిచంద్రన్‌ మూవీ పై అభిమానులు ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. విభిన్నమైన బ్యాక్ డ్రాప్‌ తో విశాల్ ను సరికొత్తగా ఆ సినిమాలో చూపించబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.. కనుక సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

తాజాగా ఆ సినిమా టైటిల్ ను మేకర్స్ రివీల్‌ చేశారు. మార్క్‌ ఆంటోని అనే టైటిల్‌ ను విశాల్‌.. అధిక్‌ రవిచంద్రన్‌ ల కాంబో మూవీకి ఖరారు చేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. పోస్టర్‌ ను కూడా విడుదల చేసి సినిమా పై ఉన్న అంచనాలను మరింతగా పెంచారు. విశాల్ ను ఈ పోస్టర్ లో చాలా విభిన్నమైన హెయిర్‌ స్టైల్‌ మరియు మాస్ గెటప్ లో చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. విశాల్ చేతిలో గన్ను ఉంది.. అంతే కాకుండా అస్తి పంజరాల నడుమ ఆయన ఉండటం కూడా సినిమా పై ఆసక్తి పెంచుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మద్య కాలంలో విశాల్‌ విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇది కూడా ఆయన కెరీర్‌ లో విభిన్నమైన సినిమా గా నిలుస్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

విశాల్‌ చాలా పవర్ ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌ ఒక విభిన్నమైన సినిమాను విశాల్ తో కలిసి ఇస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు.. కన్నడం మరియు మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ మొదలే ప్రకటించారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. మరి సినిమా విడుదల ఈ ఏడాది ఉంటుందో లేదంటే వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందో చూడాలి.