Begin typing your search above and press return to search.

కేరళ పిల్ల కేక పెట్టించేసింది!

By:  Tupaki Desk   |   6 March 2021 11:30 AM GMT
కేరళ పిల్ల కేక పెట్టించేసింది!
X
ఇప్పుడు అంతా దృశ్య రఘునాథ్ గురించే మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ కి ఒక మంచి హీరోయిన్ దొరికేసిందని చెప్పుకుంటున్నారు. 'షాదీ ముబారక్' సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. 'దిల్' రాజు నిర్మించిన ఈ సినిమాకి, పద్మశ్రీ దర్శకత్వం వహించాడు. సాగర్ హీరోగా చేసిన ఈ సినిమా ద్వారా, దృశ్య రఘునాథ్ తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ చూసినప్పుడు, గ్లామర్ పరంగా ఈ అమ్మాయి ఓ మాదిరిగా ఉందిలే అనుకున్నారు. కొత్తపిల్ల కనుక నటన అంతంత మాత్రంగా ఉండవచ్చుననే భావించారు.

కానీ ఈ సినిమాకి వెళ్లిన తరువాత దృశ్య రఘునాథ్ విషయంలో వాళ్ల ఆలోచన మారిపోయింది. ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడానికి ఈ పిల్ల ఎక్కువ సమయం తీసుకోలేదు. కథలో భాగమవుతున్నా కొద్దీ ఈ అమ్మాయిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపించింది. కామెడీ పాళ్లను ఎక్కువగా కలిపేసి అల్లిన ఈ కథలో ఈ అమ్మాయి తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది. నిజానికి ఈ పిల్ల మలయాళ మందారం .. అక్కడ చేసింది కూడా ఒక్క సినిమానే. ఇక్కడ ఈ బ్యూటీకి ఇదే మొదటి సినిమా కావడం వలన, త్తెలుగు వచ్చే అవకాశమే లేదు. కానీ గట్టిగానే కసరత్తు చేసినట్టుంది .. తెలుగు డైలాగ్స్ కి తగిన ఎక్స్ ప్రెషన్స్ తో అలరించింది .. ఆకట్టుకుంది.

విశేషమేమిటంటే ఈ సినిమా విడుదలైన రోజునే ఈ పిల్ల చాలామంది అభిమానులను సంపాదించుకుంది. కేవలం గ్లామర్ పరంగా మెరిసి మాయమవుతుందని అనుకుంటే, అభినయం పరంగాను 'ఔరా!' అనిపించేసింది. సన్నివేశాన్ని బట్టి .. సందర్భాన్ని బట్టి కొసరు అందాలను ఎరగా వేస్తూ, కుర్రాళ్ల గుండె గుడారాలను ఖాళీ చేసింది. ఈ సినిమా టాక్ సంగతి అలా ఉంచితే, ఈ పిల్లకు మాత్రం మంచి ఫ్యూచర్ ఉందని అంటున్నారు. రాజ్ తరుణ్ .. నాగశౌర్య .. నిఖిల్ వంటి యంగ్ హీరోల జోడీగా మెరిసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి .. ఈ కేరళ కొబ్బరికి ఏ రేంజులో డిమాండ్ ఉంటుందో!