Begin typing your search above and press return to search.

అలియాభ‌ట్ ని ఆడుకుంటున్న నెటిజ‌న్స్

By:  Tupaki Desk   |   4 Jan 2022 8:00 AM IST
అలియాభ‌ట్ ని ఆడుకుంటున్న నెటిజ‌న్స్
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల ఫిక్ష‌న‌ల్ స్టోరీ ఆధారంగా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ సంక్రాంతి బ‌రిలో ఈ నెల 7న విడుదల కావాల్సింది కానీ దేశ వ్యాప్తంగా మారుతున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో రిలీజ్ ని వాయిదా వేశారు.

ఈ సినిమా ద్వారా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భ‌ట్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ పోస్ట్ పోన్ కావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో నెటిజ‌న్స్ అలియాభ‌ట్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేయడం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అలియాభ‌ట్ నీ న‌వ్వు ఫేక్ అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఓ వీడియోని వైర‌ల్ చేస్తూ అలియాని ఆడుకుంటున్నారు.

ఇటీవ‌ల అలియా భ‌ట్ ఓ ఈవెంట్ లో మీడియా ఫొటోగ్రాఫ‌ర్లు కోర‌డంతో ఫొటోల‌కు పోజులిచ్చింది. ఈ వీడియోని ఫొటోగ్రాఫ‌ర్ భ‌యాని త‌న సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు. ఇందులో ర‌క ర‌కాల స్టిల్స్ ఇస్తున్న అలియా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూ క‌నిపించింది. ఇది చూసిన నెటిజ‌న్ లు ఆమెది ఫేక్ న‌వ్వు అని ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

గ‌తంలో దీపికా ప‌దుకునేది ఫేక్ న‌వ్వు అంటూ అలియా విమ‌ర్శ‌లు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఓ నెటిజ‌న్ గుర్తు చేస్తూ అలియా భ‌ట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతుండ‌టంతో అలియాకు నెట్టింట అవ‌మానం జ‌ర‌గుతోందంటూ ఆమె అభిమానులు నెటిజ‌న్ ల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.