Begin typing your search above and press return to search.

గర్వంగా ఇమ్రాన్ హాష్మి.. రౌడీగారిపై మీమ్!

By:  Tupaki Desk   |   19 March 2019 10:18 AM GMT
గర్వంగా ఇమ్రాన్ హాష్మి.. రౌడీగారిపై మీమ్!
X
కొంత కాలం క్రితం వరకూ తెలుగుసినిమాలో లిప్ లాకులు ఉండేవి కాదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సీనియర్ హీరోలు.. ఈ జెనరేషన్ స్టార్లు పెదవి ముద్దులకు దూరంగానే ఉంటున్నా యంగ్ జెనరేషన్ హీరోలు మాత్రం ఈ విషయంలు హద్దులు చేరిపేస్తున్నారు. అసలు ఈ ట్రెండ్ ను పీక్స్ కు తీసుకెళ్ళింది మాత్రం విజయ్ దేవరకొండ అనే చెప్పుకోవాలి. సినిమా జోనర్ తో సంబంధం లేకుండా హీరోయిన్లకు ముద్దులు ఇవ్వడంలో విజయ్ మిగతా హీరోలకంటే నాలుగడుగులు ముందే ఉన్నాడు.

తాజాగా రిలీజ్ అయిన 'డియర్ కామ్రేడ్' టీజర్లో కూడా ఒక ఘాడమైన ఆధర చుంబనం ఉంది. నిజానికి టీజర్లో హైలైట్ ఆ లిప్పు కిస్సే. దీంతో నెటిజనులు దేవరకొండను ఇమ్రాన్ హష్మితో పోలుస్తున్నారు. టాలీవుడ్ సీరియల్ కిస్సర్ అనే బిరుదు ఇచ్చేస్తున్నారు. దాదాపు విజయ్ నటించిన సినిమాలన్నిటిలో లిప్ లాకులు ఉంటున్నాయి. 'ద్వారక' సినిమాలో పూజా జవేరితో.. 'అర్జున్ రెడ్డి' లో షాలిని పాండేతో ..'గీత గోవిందం' మూవీలో రష్మిక మందన్నతో.. 'నోటా' సినిమా ఇంట్రో సాంగ్ లో ఓ ఫారిన్ బ్యూటీతో పెదవిముద్దులు లాగించిన విజయ్ ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' లో మరోసరి రష్మికతో లిప్పులను లాక్ చేసేసి మూతి ముద్దుల ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు.

దీంతో నెటిజనులు ఒక మీమ్ ను తయారు చేసి దేవరకొండపై జోకులు పేలుస్తున్నారు. ఈ లిప్ లాకులకు ఇంప్రెస్ అయిన ఇమ్రాన్ హాష్మి..దేవరకొండపై చెయ్యి వేసి 'చూడండి నా తమ్ముడు' అని గర్వంగా చెప్పినట్టుగా ఉంది ఆ మీమ్. విజయ్ సినిమాలు ఇలాగే కొనసాగితే ఫ్యూచర్ లో రౌడీ గారి సినిమాలో కిస్ లేకపోతే ప్రేక్షకులు ఆందోళన చేసే అవకాశం ఉంది.