Begin typing your search above and press return to search.
మేకప్ వీడియోలో నోరుజారిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
By: Tupaki Desk | 13 May 2021 4:30 AM GMTసినిమా తారలు, టీవీ నటీమణులు ఇటీవల ప్రతి విషయాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో పంచుకోవడం కామన్ గా మారిపోయింది. వారి జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని యూట్యూబ్ లో ఆవిష్కరిస్తున్నారు చాలా మంది. ఆ క్రమంలో వాళ్లు నిత్యం అభిమానుల్లో నోళ్లల్లో నానుతుంటారు. ఏ నటికయినా, సెలబ్రిటీ కయినా కావాల్సింది అదే. చాలా మంది హోమ్ టూర్, విలేజ్ టూర్ అంటూ యూట్యూబ్ లో పంచుకుంటున్నారు. మరికొంతమంది తమ మేకప్ వీడియోలను, షూటింగ్ మేకింగ్ వీడియోలను పంచుకుంటున్నారు.
అయితే ఇటీవల ఓ మేకప్ వీడియోను పంచుకున్న ఓ నటి చిక్కుల్లో పడింది. సినిమాలో అయితే స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి.. దాని ప్రకారమే మాట్లాడతారు. కానీ సొంతంగా తీసుకొనే వీడియోల్లో సమయస్ఫూర్తి ఎంతో అవసరం . ఆ టైమింగ్ మిస్ అయిపోయిందంటే మిస్ ఫైర్ అవుతుంది. అలాగే ఓ నటిమణి ఓ వీడియోలో మాట్లాడుతూ నోరుజారింది. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. చివరకు సదరు నటీమణి సారీ చెప్పాల్సి వచ్చింది.
మున్మున్ అనే ఓ టీవీనటి ఇటీవల తన ఫ్యాన్స్ కు మేకప్ టిప్స్ చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో చేసిన వ్యాఖ్యలు ఆమె కొంప ముంచాయి.ఇంతకీ ఆ వీడియోలో ఆమె ఏమందంటే.. ‘నేను భంగీ (దళిత కులానికి చెందిన వ్యక్తి)లా కనిపించాలి అనుకోవడం లేదు.. అందంగా ఉండాలి అనుకుంటున్నా’ అంటూ మాట్లాడింది. దీంతో దళిత సంఘాలు రెచ్చిపోయాయి. మామూలు అభ్యుదయం వాదులు కూడా తగులుకున్నారు.
ఓ నటివి అయి ఉండి ఓ కులాన్ని కించపరుస్తూ పోస్టులు పెడతావా? అంటూ మండిపడ్డారు. #ArrestMunmunDutta అనే హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.దీంతో మున్మున్ దిగి వచ్చింది. ’ నేను కావాలని ఆ పదం వాడలేదు. పొరపాటున జరిగిపోయింది. ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తిని ఉంటే క్షమించండి’ అంటూ వివరణ ఇచ్చుకున్నది. మొత్తానికి మున్మున్ కు మేకప్ టిప్స్ కొంప ముంచాయి.