Begin typing your search above and press return to search.
బాలు గారి కరోనాకు ఆమె కారణం కాదట
By: Tupaki Desk | 21 Aug 2020 5:30 AM GMTప్రస్తుతం దేశం మొత్తం కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది. కరోనా స్వల్ప లక్షణాలతో ఆయన మొదట ఆసుపత్రిలో జాయిన్ అయినా ఆ తర్వాత శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తూ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు ప్రకటించారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది. ఏమాత్రం మార్పు రాలేదు. దాంతో బాలు అభిమానులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఈ సమయంలోనే బాలు గారికి కరోనా సింగర్ మాళవిక ద్వారా సోకిందనే ప్రచారం మొదలయ్యింది.
గాయిని మాళవిక కరోనా లక్షణాలతో ఉన్నా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో బాలు గారితో పాల్గొంది. ఆ సమయంలోనే పలువురు సింగర్స్ కు కరోనా వ్యాప్తి చెందింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో మాళవికను చాలా మంది సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన నీ తీరు ఏమాత్రం బాగాలేదంటూ ఆమెను అసభ్యంగా విమర్శిస్తున్నారట.
ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాలు గారికి కరోనా వచ్చింది తన వల్ల కాదంటూ చెప్పుకొచ్చింది. నా గురించి తప్పుడు పోస్ట్ లు పెట్టి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది. దయచేసి తన గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. బాలు గారి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలంటూ కోరుకుంటున్నాను అంది.