Begin typing your search above and press return to search.

'మా' ఉండగా 'మెగా' డామినేషన్ ఏంటి...?

By:  Tupaki Desk   |   29 May 2020 8:45 AM GMT
మా ఉండగా మెగా డామినేషన్ ఏంటి...?
X
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందరం కలిసే ఉన్నాం.. మా మధ్య ఎలాంటి గ్రూపులు లేవు.. గొడవలు లేవు అని చెప్తూ వస్తున్నా వారిలో కొంతమంది ఆధిపత్యం కోసం గ్రూపులు క్రియేట్ చేస్తుంటారనేది ఇండస్ట్రీ వర్గాల వాదన. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో తమ ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోందని ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. రీసెంటుగా చిత్ర పరిశ్రమలో ఏర్పడిన పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని మెగా ఫ్యామిలీ చూస్తున్నారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా సినీ ఇండస్ట్రీ మూత బడిన విషయం తెలిసిందే. దీని వలన సినిమాపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు పలువురు సినీ రంగ ప్రముఖులు తెలంగాణా సీఎం కేసీఆర్‌ తో సమావేశమైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినిమా షూటింగ్‌ లు.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్.. సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అంతకముందు కూడా మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ కలసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మాములుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏవైనా సమస్యలు వస్తే 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) చూసుకుంటుంది. అలానే ముందుండి ఇండస్ట్రీలోని అందరిని కలుపుకొనిపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. అయితే ఇప్పడు మెగాస్టార్ చిరంజీవి 'మా' ని పక్కన పెట్టి తనే మీటింగులు ఏర్పాటు చేయడంపై అందరూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి సంభందించిన సమావేశాలు తెలుగు ఫిలిం ఛాంబర్ లో కండక్ట్ చేస్తుంటారు. కానీ చిరు ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి తన నివాసంలో మీటింగ్ పెట్టాడని.. ఆ మీటింగ్ కి కూడా కొంతమందిని మాత్రమే పిలిచి మిగతా వారిని కావాలనే పక్కన పెట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో కాకుండా తన ఇంట్లో సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని.. 'మా' ని కాదని మరో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినీ ఆర్టిస్టుల కోసం 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) 1993లో మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంటుగా అక్కినేని నాగేశ్వరరావు చీఫ్ అడ్వైజర్ గా ఏర్పాటైంది. మరి ఆయన ఫౌండర్ గా ఉన్న 'మా' ని కాదని చిరు ఎందుకు సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ 'మా'లో చిచ్చుపెట్టి సొంత డబ్బా కోసం ఇంకొకటి పెట్టి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని.. అందుకోసం కావాలనే కొంతమందిని ఇండస్ట్రీలో దూరం పెడుతున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.