Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి మాలి పువ్వు ట్వీట్‌.. పోవే అంటూ ఆవారా ట్వీట్‌

By:  Tupaki Desk   |   1 May 2020 1:30 PM IST
మంచు లక్ష్మి మాలి పువ్వు ట్వీట్‌.. పోవే అంటూ ఆవారా ట్వీట్‌
X
మంచు లక్ష్మి డైలాగ్స్‌.. ఆమె యాస.. బాడీ లాంగ్వేజ్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు ఏ నటిపై రానన్ని మీమ్స్‌ మంచు లక్ష్మి పై నెట్టింట వచ్చాయి. ఆమె వాయిస్‌ తో ఎంతో మంది టిక్‌ టాక్‌ వీడియోలు కూడా చేశారు. ఆమె ఇంగ్లీష్‌ మాట్లాడే తీరుపై చాలా వీడియోలు కూడా వచ్చాయి. అయితే ఈసారి విభిన్నంగా మంచు లక్ష్మి బుక్‌ అయ్యింది. అమ్మ నాకు మల్లె పూవ్వులు పెడుతుంది అంటూ ఫొటోను పోస్ట్‌ చేసింది. అయితే మల్లె ను ఇంగ్లీష్‌ లో మాలి అంటూ రాసింది.

తెలుగు సరిగా మాట్లాడటమే కాదు.. తెలుగును కనీసం ఇంగ్లీష్‌ లో అయినా సరిగా రాయలేవా అంటూ చాలా మంది నెటిజన్స్‌ ఆమెకు కామెంట్స్‌ చేశారు. ఆవారా అనే ట్విట్టర్‌ అకౌంట్‌ హోల్డర్‌.. మాలి కాదు అది మల్లె అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశాడు. అతడి ట్వీట్‌ ను ఫన్నీగా తీసుకుందో లేదంటే సీరియస్‌ గా స్పందించిందో కాని అతడిని పో.. బే అంటూ స్పందిస్తూ కామెంట్‌ చేసింది. ఆమె కామెంట్‌ పై అతడు ప్రతిగా స్పందిస్తూ ‘పో వే’ అంటూ కామెంట్‌ చేశాడు.

వీరిద్దరి ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి. అతడు ఎలాంటి బూతు లేకుండా అది మాలి కాదు మల్లె అంటూ చెప్పినా కూడా పో బే అంటూ మంచు లక్ష్మి సీరియస్‌ అవ్వడం సరిగా లేదంటూ చాలా మంది ఆమె తీరును తప్పుబడుతున్నారు. నెట్టింట ఈ విషయంలో మంచు లక్ష్మిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆవారా ‘పోవే’ అన్న తర్వాత మళ్లీ మంచు లక్ష్మి స్పందించ లేదు. అతడికి పర్సనల్‌ గా ఏమైనా మెసేజ్‌ చేసి ఉంటుందేమో..!