Begin typing your search above and press return to search.
ఇన్నాళ్లు వెనకేసుకు వచ్చిన వాళ్లే ఇప్పుడు ఆమెను విమర్శిస్తున్నారు
By: Tupaki Desk | 9 Dec 2020 5:50 AM GMTకంగనా అంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ సూపర్ స్టార్స్ నుండి చిన్న స్టార్స్ వరకు అందరితో ఆమె విభేదాలు పెట్టుకుంది. తన గురించి ఎవరైనా విమర్శలు చేస్తే విరుచుకు పడే తత్వం ఉన్న కంగనా ముక్కు సూటి తనంకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటూ కంగనా ప్రశంసలు దక్కించుకుంది. అలాంటి కంగనా రనౌత్ ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఇటీవల రైతు ఉద్యమంను అవహేళ చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయిన కంగనా ఇప్పుడు మళ్లీ విమర్శలు మూట కట్టుకుంది.
నిన్న కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్ పై కంగనా విమర్శలు చేసింది. రైతుల ఆందోళను మరోసారి తప్పుబట్టే విధంగా ఆమె ట్వీట్ చేసింది. బంద్ నేపథ్యంలో కంగనా సోషల్ మీడియాలో.. భారత్ ను బంద్ చేద్దాం రండి.. ఇప్పటికే ఈ పడవకు తుఫాన్ వెనుక తుఫాన్ వస్తూనే ఉంది. ఇప్పుడు మీరు గొడ్డలితో పడవకు రంద్రం చేస్తున్నారంటూ రైతులను ఉద్దేశించి కంగనా ట్వీట్ చేసింది. కంగనా ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇన్నాళ్లు ఆమె ఫైర్ ను అభిమానించిన వారు కూడా ఇప్పుడు మోడీకి మద్దతుగా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఒక రాజకీయ నాయకురాలిగా గుడ్డిగా సమర్థిస్తూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని విమర్శించడం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. కంగనా తన ఇమేజ్ ను తానే దెబ్బ తీసుకుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇలాంటి సందర్బాల్లో రైతులకు మద్దతుగా నిలువకున్నా కూడా తటస్థంగా ఉండటం మంచిది. ఇప్పుడు ఎక్కువ శాతం బాలీవుడ్ ప్రముఖులు అదే చేస్తున్నారు. కాని కంగనా మాత్రం తాను ప్రత్యేకం అనిపించుకోవడం కోసం బంద్ ను అవహేళన చేసింది. దాంతో ఆమె విమర్శలపాలయ్యింది.