Begin typing your search above and press return to search.
చిక్కుల్లో అమీర్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్లు
By: Tupaki Desk | 2 Oct 2021 8:00 PM ISTఎరక్కపోయి ఇరుక్కున్నాడు బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్. సినిమాల్లో బయట వారు వ్యవహరిస్తున్న తీరుపై జనాలు ఫుల్ ఫోకస్ చేస్తుంటారు. ఏదో ఒక తప్పు చేసి వారు ఇరుక్కుంటుంటారు.ఈ క్రమంలోనే స్టార్లపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. నిరసనలకు దిగడం.. చివరకు ఒక మెట్టు దిగి క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి.
కొద్దిరోజులుగా అగ్రహీరోలు చేస్తున్న యాడ్స్ పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆలియా భట్ తీసిన 'కన్యాదాన్ ' యాడ్ పై ప్రేక్షకులు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆలియా తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన ఓ యాడ్ ఇప్పుడు దుమారం రేపుతోంది.
సియట్ టైర్ల కంపెనీ యాడ్ లో అమీర్ ఖాన్ నటించాడు. ఈ యాడ్ ప్రసారమైంది. ఇందులో రోడ్లు ఉంది టపాసులు కాల్చడానికి కాదు.. అంటూ జనాలకు అమీర్ క్లాస్ పీకుతాడు.. సదురు టైర్ల యాడ్ ను ప్రమోట్ చేస్తూ దీపావళి పండుగను,.హిందువుల మనోభావాలను దెబ్బ తీశాడని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సియట్ ను బాయ్ కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ లతో ట్వీట్లు చేస్తున్నారు.
ఇక తమకు అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని.. యాడ్ ను తొలగించాలని సియట్ కంపెనీని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మతాన్ని, పండుగలను కించపరిచేలా సియట్, అమీర్ ఖాన్ వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడీ కొత్త వివాదం అమీర్ ఖాన్ మెడకు చుట్టుకునేలా ఉంది.