Begin typing your search above and press return to search.
పారితోషికం విడిగా.. విరాళం కంబైన్డ్ గానా?
By: Tupaki Desk | 27 April 2020 5:00 PM ISTకరోనా క్రైసిస్ సాధారణ ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండే అలవాటు లేని చాలామంది స్టార్లు దాదాపుగా 'హౌస్ అరెస్ట్' అయిపోయారు. ఇక మరో సమస్య ఏంటంటే స్టార్లు ఎవరైనా కరోనా బాదితులకు ఏదో ఒకరూపంలో సాయం చెయ్యకపోతే ట్రోలింగ్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామందికి ఈ హీట్ తగిలింది. కొందరిని తక్కువ విరాళం ఇచ్చారని కూడా గట్టిగా తగులుకుంటున్నారు. తాజాగా సమంతా వంతు వచ్చింది.
కరోనా క్రైసిస్ విషయంలో అక్కినేని నాగ చైతన్య తన వంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సమంతా మాత్రం ఇంతవరకూ తన వంతుగా విరాళం ప్రకటించలేదు. ఈమధ్య చాలారోజులు సమంతా సోషల్ మీడియాలో 'స్లీపింగ్ మోడ్' లో ఉండడంతో నెటిజన్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే గాఢనిద్ర నుంచి బైటకొచ్చాను అంటూ రెండు మూడు రోజుల క్రితం సగర్వంగా ప్రకటించింది. దీంతో విమర్శకులు తమ విమర్శలకు పదును పెట్టారు. విరాళం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే సమంతా అభిమానులు తమ హీరోయిన్ మనసు మంచిదని గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని.. అయినా భర్త నాగ చైతన్య విరాళం ఇచ్చాడుగా అని వెనకేసుకొచ్చినా విమర్శకులు ఒప్పుకోవడం లేదు. భర్త పారితోషికం వేరే.. భార్య పారితోషికం వేరే కదా.. విడిగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కదా.. విరాళం మాత్రం జాయింటుగా ఇస్తారా అంటూ సమంతాపై నిప్పులు కక్కుతున్నారు.
ఇదొక్కటే కాదు.. సమంతా రేపు(ఏప్రిల్ 28) పుట్టిన రోజు జరుపుకుంటోంది. పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరగబోతున్నాయని వార్తలు రావడంతో "ఈ టైం లో బర్త్ డే సెలెబ్రేషన్లు ఏంటి?" అని కామెంట్ చేస్తున్నారు. ఇంకా వేడుకలు జరపకముందే పరిస్థితి ఇలా ఉంటే రేపు నిజంగా సెలబ్రేషన్స్ జరిగితే ట్రోలింగ్ తప్పదని అంటున్నారు.