Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నుండి అతడిని తొలగించండి.. డిమాండ్ షురూ

By:  Tupaki Desk   |   19 Oct 2022 6:36 AM GMT
బిగ్ బాస్ నుండి అతడిని తొలగించండి.. డిమాండ్ షురూ
X
బిగ్ బాస్ సందడి దేశవ్యాప్తంగా నెలకొంది. అన్ని భాషల్లో విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో నాగార్జున, హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. అయితే ఎన్నడూ లేనంతగా ఈసారి హిందీ బిగ్ బాస్ పై వివాదాలు చుట్టుముడుతున్నాయి. హీరోయిన్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ దర్శకుడిని బిగ్ బాస్ నుంచి తొలగించాలన్న డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది.

హిందీలో బిగ్ బాస్ 16 శరవేగంగా జరుగుతోంది. వివాదాస్పద దర్శకుడు, సాజిద్ ఖాన్ కూడా ఈ సీజన్‌లో షోలో ఈసారి కంటెస్టెంట్ గా చేరాడు. అతను ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి, సోషల్ మీడియా ప్రతికూల వ్యాఖ్యలతో నిండిపోతోంది.

సాజిద్ ఖాన్ కొన్నేళ్ల క్రితం మీటూ కేసులో ఇరుక్కున్నాడు. అతడిపై చాలా మంది హీరోయిన్లు లైంగిక ఆరోపణలు చేశారు. ఇప్పుడు, ప్రముఖ నటుడు అలీ ఫైజల్ సోషల్ మీడియాలో సరికొత్త డిమాండ్ లేవనెత్తాడు. “బిగ్ బాస్ నుండి సాజిద్‌ను తరిమికొట్టండి.’అంటూ పిలుపునిచ్చారు.

సాజిద్ ఇప్పటికే ఇండస్ట్రీ నుండి ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. ఇప్పుడు అతను తిరిగి వచ్చాడు. అతని చేరికతో షో కొత్త మలుపు తిరిగింది. మంచి టీఆర్పీలు సాధిస్తోంది.

సాజిద్ షోలోకి ప్రవేశం గురించి మేకర్స్ మరియు హోస్ట్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించలేదు. ఇంత విమర్శలు వచ్చినా కూడా అతడిని తీసేసే విషయంలో బిగ్ బాస్ టీం అస్సలు చొరవ చూపించడం లేదు.

బిగ్ బాస్ అంటేనే కాంట్రావర్సీ.. అదే కావాలి అందరికీ. అందుకే సాజిద్ తో ఎంత వివాదాలు వస్తే అంత బెటర్ అన్నట్టుగా బిగ్ బాస్ నిర్వాహకులు చూస్తున్నారు.అ తడితోనే టీఆర్పీ పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.