Begin typing your search above and press return to search.

క‌రోనా సోకిన హీరోయిన్ పై ఇలాంటి కామెంట్లా?

By:  Tupaki Desk   |   8 Jan 2022 12:30 PM GMT
క‌రోనా సోకిన హీరోయిన్ పై ఇలాంటి కామెంట్లా?
X
న‌టి స్వ‌రా భాస్కార్ కోవిడ్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. గురువారం త‌న‌కు వైర‌స్ సోకింద‌ని హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్లు స్వ‌రా భాస్క‌ర్ ట్విట‌ర్ ద్వారా తెలిపింది. దీంతో ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కొంత మంది నెటి జ‌నులు కోరుక‌గా మరికొంత మంది ఆమెను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. సోష‌ల్ మీడియాలో స్వ‌రా భాస్క‌ర్ ని పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసారు. ఆమె మ‌ర‌ణాన్ని కోరుకుంటూ ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కామెంట్లు పెట్టారు. దీంతో ఆ వార్త‌ల‌పై స్వ‌రా భాస్క‌ర్ స్పందించింది. ``కొత్త సంవ‌త్స‌రం 2022 లో విన్న అత్యుత్త‌మ వార్త‌ల‌లో ఇది మొద‌టిది`` అని ట్వీట్ చేసింది.

దీనికి బ‌ధులుగా ఇంకొంత మంది రిప్ అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కూ స‌హ‌నంగా ఉన్న స్వ‌రా ఒక్క‌సారిగా శివంగిలా మారిపోయింది. త‌మ భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవాల‌ని..లేక‌పోతే సీన్ వేరేలా ఉంటుంద‌ని సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది. ``నా మ‌ర‌ణం కోసం ప్రార‌ధిస్తున్న నా ప్రియ‌మైన న‌ఫ్ర‌తీ చింటూస్ ట్రోల‌ర్స్ కు.. దోస్ట‌న్ అప్నీ భావ‌న్ నాయీం కాబూ మే ర‌ఖో..మ‌ఝే కుచ్ హో గ‌యా తో ఆప్కీ రోజీ రోటీ చిన్ జాయేగీ..ఘ‌ర్ కైసే చ‌లేగా`` అని ట్వీట్ చేసింది. అలాగే ఉద్దేశ పూర్వ‌క కామెంట్ల‌ను స్ర్కీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. దీంతో ట్రోలర్స్ వేగం త‌గ్గించారు. ఇదెంత దూరం దారి తీస్తుందోన‌ని ఒక్కొక్క‌రుగా సైలెంట్ అవ్వ‌డం మొద‌లు పెట్టారు.

స్వ‌రా భాస్క‌ర్ కోవిడ్ రెండు డోసుల టీకా తీసుకుంది. అయినా జ్వ‌రం..త‌ల‌నొప్పి..రుచి కోల్పోవ‌డంతో సందేహం వ‌చ్చి కోవిడ్ ప‌రీక్ష చేసుకోగా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో టీకాల వ‌ల్ల ఫ‌లితం ఏముంద‌ని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం స్వ‌రా భాస్క‌ర్ బాలీవుడ్ లో `జాన్ చార్ యార్` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అయితే కోవిడ్ కార‌ణంగా స్వ‌రా భాస్క‌ర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది.