Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ చెప్తానన్న మంచు విష్ణు.. మరో బేబీనా?
By: Tupaki Desk | 13 Jan 2022 4:19 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో.. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఎప్పుడు కూడా టచ్ లో ఉంటాడు. తన వ్యక్తిగత మరియు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు అనేక విషయాల గురించి ట్విట్టర్ లో రెగ్యులర్ గా ట్వీట్స్ వేస్తూనే ఉంటాడు. మా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏంటీ.. చేపట్టిన కార్యక్రమాలు ఏంటీ.. చేపట్టబోతున్న కార్యక్రమాలు ఏంటీ అనే విషయాలను ట్వీట్స్ ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఏపీలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉండటంతో సమస్యను ఎదుర్కొంటున్నాయి. దాంతో మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు స్పందించాల్సిన అవసరం ఉందంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో మంచు విష్ణు చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది.
మంచు విష్ణు ప్రతి విషయాన్ని కూడా చాలా సస్పెన్స్ గా ఉంచి రివీల్ చేయాలని చూస్తూ ఉంటాడు. తాజాగా ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక విషయం సినీ జనాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేవుడు మంచి వాడు.. ఒక మంచి శుభవార్త మీతో షేర్ చేసుకోవడానికి సిద్దంగా ఉంది. అతి త్వరలోనే నాన్న గారు మీకు ఆ విషయాన్ని తెలియజేస్తారు అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు నలుగురు నాలుగు రకాలుగా స్పందించారు. అన్నింటికంటే ఆసక్తికరమైన కామెంట్ ను గాయత్రి అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ చేయడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటీ మరో బేబీ రాబోతుందా అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు చాలా మంది స్పందించారు. ఇప్పటికే నలుగురు అయ్యారు.. మరొకరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కచ్చితంగా ఆ న్యూస్ మరో బేబీ గురించి అయితే కాదు అని క్లారిటీ ఉంది. మరి దేని గురించి ఆ ట్వీట్ అంటూ ఇప్పుడు ఇండస్ట్రీవర్గాల్లో చర్చ జరుగుతోంది. మంచు విష్ణు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు కాని అవేవి విడుదల దశలో లేవు. కనుక సినిమాల గురించి ఆ గుడ్ న్యూస్ కాకపోవచ్చు. ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా మా కు సంబంధించినది అయ్యి ఉంటుందని అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది మోహన్ బాబు రివీల్ చేస్తే కాని క్లారిటీ రాదు. మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో నెట్టింట టార్గెట్ అవుతోంది. టికెట్ల రేట్ల విషయంలో ఎందుకు జగన్ తో మాట్లాడటం లేదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ ట్రోల్స్ కు సమాధానంగా ఈ గుడ్ న్యూస్ ఉంటుందా అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.