Begin typing your search above and press return to search.

కామెంట్లతో స్టార్ హీరోను 'విలన్' చేస్తున్న నెటిజన్లు.. డైరెక్టర్ మాటేంటి??

By:  Tupaki Desk   |   6 Jan 2021 12:30 AM GMT
కామెంట్లతో స్టార్ హీరోను విలన్ చేస్తున్న నెటిజన్లు.. డైరెక్టర్ మాటేంటి??
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ఓకే చేసిన సినిమాలన్నీ భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజిలోనే విడుదల కాబోతున్నాయి. ఓవైపు రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుస సినిమాలను ప్రకటించి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. ఇక రాధేశ్యామ్ సినిమా చివరి దశలో ఉండగా.. మరో తీపి కబురు ఫ్యాన్స్ కోసం రెడీ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. ఇంతవరకు చూపించని వయోలెన్స్, యాక్షన్ ప్లాన్ చూపిస్తారట. ఈ నెలలో ప్రభాస్ రెండు సినిమాలు ప్రారంభం చేయబోతున్నాడు. అందులో ఒకటి సలార్ కాగా మరొకటి ఆదిపురుష్. రెండు డిఫరెంట్ సినిమాలు కానీ షూటింగ్ మాత్రం ఒకే నెలలో స్టార్ట్ చేస్తున్నాడు ప్రభాస్. సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ ఈ సంక్రాంతి తర్వాత అంటే జనవరి మూడో వారం నుండి ప్రారంభం కాబోతున్నాయి.

అంతేగాక ప్రశాంత్ - ప్రభాస్ కాంబో సలార్ మూవీని కేవలం నాలుగు నెలలలో పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు టాక్. ఇదిలా ఉండగా.. ప్రభాస్ సలార్ సినిమా గురించి మరో వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ వయోలెన్స్ హీరోగా కనిపిస్తే మరి విలన్ ఇంకెలా ఉండాలి అనే చర్చలు నడుస్తున్నాయి. అయితే బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహం.. సలార్ మూవీలో విలన్ గా నటిస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. పుకారు అయినప్పటికీ వినడానికి, చూడటానికి చాలా బాగుందని కొందరు అంటున్నారు. ప్రభాస్ లాంటి భారీ దేహంతో తలపడాలంటే మినిమం జాన్ అబ్రహం లాంటి ఫిజిక్ అయితేనే బాగుంటుందని సినీ వర్గాలలో టాక్. ఈ పుకారు పై ఇంకా సలార్ టీమ్ స్పందించలేదు. ఇప్పటికే హీరోయిన్ గా దిశా పటాని ఓకే అయిందనే పుకార్లకు కూడా సలార్ టీమ్ జవాబు చెప్పలేదు. ఈ గాసిప్ లకు పుల్ స్టాప్ పెట్టాల్సింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రమే అనడంలో సందేహం లేదు. చూడాలి మరి ప్రభాస్ కి విలన్ జాన్ అబ్రహం అయితే సూట్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.