Begin typing your search above and press return to search.
స్టార్ హీరో కూతురి మీద నెటిజెన్ల ఫైర్
By: Tupaki Desk | 1 Jun 2019 5:57 PM ISTసోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయాక సెలబ్రిటీలు ఏదైనా చేసేముందు ఎక్కడికైనా వెళ్లేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలో హై ఎండ్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ చాలా మాములు వస్తువుగా మారిపోయిన తరుణంలో విషయం ఏదైనా సరే వైరల్ కావడానికి క్షణాలు పట్టడం లేదు. తాజాగా అలాంటి అనుభవమే ఓ స్టార్ కపుల్ కు ఎదురైంది.
ఇటీవలే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నాన్న ప్రముఖ స్టంట్ మాస్టర్ వీరు దేవగన్ కాలం చేసిన సంగతి తెలిసిందే. వారు వీరు అని తేడా లేకుండా అజయ్ కాజోల్ జంటకు అందరూ వచ్చి సంతాపం తెలిపారు. పిల్లలు భోరున కన్నీరు పెట్టుకోవడం చూసి గుండెలు బరువెక్కిపోయాయి. సరే కుటుంబ పెద్ద పోయినప్పుడు విషాదం కొన్నిరోజుల పాటు ఉండటం ఎక్కడైనా సహజం
కాని ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. అజయ్ కాజోల్ ల గారాల పట్టి నైసా దేవగన్ తాతయ్య అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే ఓ పార్లర్ కు వెళ్లి సరదాగా స్నేహితులతో పార్టీ చేసుకుని అక్కడే లంచ్ చేసి బయటికి చలాకిగా వస్తూ ఫోటోలకు దొరికిపోయింది. ఇవి ఓ మీడియాలో వచ్చేయడంతో నెటిజెన్లు ఫైర్ అయిపోయారు.
లైఫ్ ని ఎంజాయ్ చేయడం తప్పేమీ కాదని ఇలా నాన్న తండ్రి స్వయానా తాతయ్య చనిపోయి ఒక్కరోజు కాకముందే ఇలా చేయడం బాలేదని ట్రాల్ చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే నైసా దేవగన్ నిజంగానే ఆ ఫోటోలలో నవ్వుతు తుళ్ళుతూ యమ హుషారుగా ఉంది. దానికి తగ్గట్టే డ్రెస్ కూడా అల్ట్రా మాడరన్ గా ఉండటంతో ఇక కామెంట్ల బ్యాచ్ ఊరికే ఉంటారా