Begin typing your search above and press return to search.

బాలీవుడ్ మెగాస్టార్ ట్వీట్​పై నెటిజన్ల మండిపాటు..!

By:  Tupaki Desk   |   22 Jan 2021 7:15 PM IST
బాలీవుడ్ మెగాస్టార్ ట్వీట్​పై నెటిజన్ల మండిపాటు..!
X
ఇటీవల బాలీవుడ్​ సూపర్​స్టార్​ అమితాబ్​ బచ్చన్​ పెట్టిన ఓ ట్వీట్​ సోషల్​మీడియాలో రచ్చ రచ్చగా మారింది. బిగ్​బీని నెటిజన్లు ఓ రేంజ్​లో ఆడుకుంటున్నారు. అమితాబ్​ బచ్చన్​ జీ మీరు వయసులో పెద్దవాళ్లు హుందాగా ఉండాలి కానీ ఇటువంటి ట్వీట్లు ఏమిటంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. బిగ్​బాస్​ ఓ టీవీ ఛానల్​లో ‘కౌన్​బనేడా కరోడా పతి’ అనే టీవీ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో భాగంగా ఆయన ఇటీవల
ఆయన ఇటీవల అంతర్జాతీ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) ముఖ్య ఆర్థిక సలహాదారు గీతా గోపినాథ్​ను స్క్రీన్​పై డిస్​ప్లే చేసి.. ఈ ఫొటోలో కనిపించే ఆర్థిక వేత్త 2019 నుంచి ఏ సంస్థకు చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్నారు అని ప్రశ్న అడిగారు.

ఇంతవరకు బాగానే ఉంది. దీనికి ఓ కామెంట్​ కూడా పెట్టారు. ఈమె చాలా అందంగా ఉంది. అసలు ఈమెను ఆర్థికవేత్త అంటే ఎవరూ నమ్మరు. అంటూ ఓ కామెంట్​ జత చేశారు. అయితే ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. గీతా గోపినాథ్​ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. బిగ్ బీ కామెంట్ ని ఎంత మాత్రం నెగటివ్ గా తీసుకోలేదు. తాను బిగ్​బీకి పెద్ద ఫ్యాన్ అని .. ఈ వీడియో తనకు ఎంతో స్పెషల్​ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

అయితే అమితాబ్​ అలా స్పందించడం కొందరు నెటిజన్లకు నచ్చలేదు. ‘గీతా గోపినాథ్​ ప్రశ్న అడిగారు బాగుంది. కానీ ఆమె అందంగా ఉందని చెప్పడం ఎందుకు? ఆమె అందం గురించి ప్రస్తావన ఎందుకు? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.బిగ్ బీ లాంటి వ్యక్తికి ఇది తగదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎప్పుడు లేనిది ఆయన ప్రస్తుతం వివాదాస్పద కామెంట్ చేసి నెట్టింట్లో విమర్శలు కొని తెచ్చుకున్నారు.