Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : నీ సింప్లిసిటీకి మేము ఫిదా

By:  Tupaki Desk   |   19 Oct 2021 11:30 AM GMT
ఫొటోటాక్ : నీ సింప్లిసిటీకి మేము ఫిదా
X
అందం.. ప్రతిభ కలగలిపిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకులను మొదటి సినిమాతో ఫిదా చేసిన సాయి పల్లవి అప్పటి నుండి తన ప్రతి సినిమాతో ఫిదా చేస్తూనే ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియా పోస్ట్‌లు మరియు ఇరత విషయాలతో కూడా సాయి పల్లవి రెగ్యులర్ గా మీడియాలో నిలుస్తూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. నాచురల్ బ్యూటీ అంటూ సాయి పల్లవికి పేరు ఉంది. డబ్బు కోసం ఎలాంటి పాత్రలు అయినా చేసే వారు చాలా మంది ఉంటారు. కాని అలాంటి వారి జాబితాలో సాయి పల్లవి అస్సలు ఉండదు. కోట్ల రూపాయల పారితోషికం వచ్చినా.. చిరంజీవి వంటి స్టార్‌ సినిమాలో ఆఫర్ వచ్చినా కూడా తన పాత్ర నచ్చితేనే నటించేందుకు ఓకే చెప్తుంది. అలాంటి సాయి పల్లవి సింప్లిసిటీకి మారు పేరు అనడంలో సందేహం లేదు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమాలు వరుసగా విడుదలకు సిద్దం అవుతున్నాయి.

తాజాగా సాయి పల్లవి సత్యసాయి ఆశ్రమంలో ప్రత్యక్ష్యం అయ్యింది. చిన్నప్పటి నుండి ఆమె సత్యసాయి ట్రస్ట్‌ కు వెళ్తూ ఉంటుందట. ఆమె తల్లికి సత్య సాయి అంటే చాలా నమ్మకం. అందుకే ఆయన పేరుతోనే సాయి పల్లవి అనే పేరును పెట్టింది. అమ్మ దారిలోనే సాయి పల్లవి కూడా సత్య సాయిని నమ్మి ప్రార్థిస్తుంది. సత్యసాయి ట్రస్ట్‌ ను మరియు ఆశ్రమంను రెగ్యులర్ గా సాయి పల్లవి దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఆమె వెళ్లిన సమయంలో అక్కడి వారు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సాయి పల్లవి ఈసారి చాలా సింపుల్‌ గా ఒక సాదారణ చీర కట్టుకుని అక్కడకు వెళ్లింది. సాయి పల్లవి సింప్లిసిటీకి అంతా కూడా షాక్ అవుతున్నారు.

సాయి పల్లవి ఒక సాదారణ చీర కట్టుకోవడమే కాకుండా పల్లెటూరు వారు.. ముసలి వారు కనుక కొంగును బుజం మీదకు వేసుకుని ఒళ్లు అంతా కప్పుకున్నట్లుగా కప్పుకుంది. సాయి పల్లవి సింప్లిసిటీకి అంతా ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌ అంటే ఇంత సింపుల్ గా ఉంటారా అంటూ అంతా నోరు వెళ్లబెడుతున్నారు. ఈమద్య కాలంలో యూట్యూబ్‌ సెలబ్రెటీలు.. ఇన్ స్టా సెలబ్రెటీలు కూడా నడుము చూపిస్తూ.. క్లీ వేజ్‌ షో చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. కాని స్టార్ హీరోయిన్‌ అయిన సాయి పల్లవి ఇలా పద్దతిగా కనిపించడం నిజంగా అభినందనీయం. నీ సింప్లిసిటీకి మేము ఫిదా సాయి పల్లవి..!