Begin typing your search above and press return to search.

ఆమెకు ఓటు వేయవద్దని పరువు పోగొట్టుకున్న స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   20 May 2019 5:50 AM GMT
ఆమెకు ఓటు వేయవద్దని పరువు పోగొట్టుకున్న స్టార్‌ హీరో
X
సినిమా స్టార్స్‌, రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడేప్పుడు, ఏదైనా విషయంను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా వారి పోస్ట్‌ లు లక్షలాది మంది చూడటంతో పాటు, వారందరు కూడా స్పందించే అవకాశం ఉంటుందనే విషయంను గుర్తుంచుకోవాలి. అందుకే ఎక్కువ శాతం సెలబ్రెటీలు ఆచి తూచి స్పందిస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నటుడైన పర్హాన్‌ అక్తర్‌ చేసిన పొలిటికల్‌ ట్వీట్‌ ఆయనకే రివర్స్‌ అయ్యింది.

గత కొన్ని రోజులుగా ప్రగ్యా ఠాకూర్‌ గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పర్షాన్‌ అక్తర్‌ కూడా ట్వీట్‌ చేశాడు. బోపాల్‌ బీజేపీ అభ్యర్థి అయిన ప్రగ్యా ఠాకూర్‌ కు ఓటు వేయవద్దని, ఆమె నుండి మీ నియోజక వర్గంను కాపాడుకోండి అంటూ బోపాల్‌ ఓటర్లకు నిన్న అంటే మే 19వ తారీకున విజ్ఞప్తి చేశాడు. దాంతో అతడిపై తీవ్రమైన ట్రోల్స్‌ వస్తున్నాయి. దానికి కారణం బోపాల్‌ లో ఈనెల 12వ తారీకునే ఎన్నికలు జరిగిపోయాయి.

రాజకీయాల గురించి అవగాహణ లేకుండా, ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో తెలుసుకోకుండా మాట్లాడేయడం మంచిది కాదంటూ పర్హాన్‌ అక్తర్‌ పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రగ్యా ఠాకూర్‌ గురించి మాట్లాడే అర్హత నీకు ఏముందని మాట్లాడుతున్నావంటూ మరి కొందరు ఆయనపై విరుచుకు పడుతున్నారు. దాంతో పర్షాన్‌ తన వ్యాఖ్యలను తొలగించాడు.