Begin typing your search above and press return to search.
అంత పెద్ద కంపెనీ బాహుబలిని కొనేసింది
By: Tupaki Desk | 8 Aug 2017 4:50 PM GMTఇప్పుడు బాహుబలి 2 రైట్స్ ను ఆల్రెడీ కొన్ని టివి చానళ్ళకు అమ్మేశారు కదా..ఇంకా కొత్తగా రైట్స్ఏంటి నాయనా అనుకుంటున్నారా? అయితే అవన్నీ ఆల్రెడీ అమ్మేశారు కాని.. ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్ లో సినిమాలను యుట్యూబ్ లో పెట్టట్లేదు. ఎందుకంటే యుట్యూబ్ లో మనం సినిమా అప్ లోడ్ చేస్తే మనకు దానిపై వచ్చే యాడ్స్ తాలూకు ఆధాయం ఎంతో ఉండదు. అదే ఏదన్నా కంటెంట్ స్ర్టీమింగ్ వెబ్ సైట్ కు అమ్ముకుంటే ఎక్కువొస్తాయ్. అమెజాన్ మరియు హాట్ స్టార్ ఇండియాలో ఆన్ లైన్ స్ర్టీమింగ్ లో రెచ్చిపోతుంటే ఇప్పుడు వీళ్ళకు తాత అయిన నెట్ ఫ్లిక్స్ కూడా మార్కెట్లోకి దిగాడు. దిగడంతోనే భలే కొనేశాడులే.
ఆల్రెడీ ఇండియాలో నెట్ ఫ్లిక్స్ స్ర్టీమింగ్ మొదలైనప్పటి నుండి చాలామంది నెలకు 600 రూపాయలు చందా కట్టేసి మరీ అందులో కంటెంట్ చూస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్న 600 మిలియన్ కస్టమర్లను అలరించడానికి నెట్ ఫ్లిక్స్ ఏకంగా బాహుబలి 2 సినిమాను కొనేసింది. ఆల్రెడీ ఈ సినిమా హిందీ మరియు మలయాళం వర్షన్లను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు కూడా. అమెజాన్ నుండి పోటీ తట్టుకొని మరీ నెట్ ఫ్లిక్స్ చాలా భారీ మొత్తానికి ఈ సినిమాను సొంతం చేసుకుందంట. సో ప్రపంచంలో ఏ మూలనైనా ఉన్నవారు ఈ సినిమాను చూడాలని అనుకుంటే ఇప్పుడు చక్కగా టొరెంట్లలోకి వెళ్ళి పైరసీ ప్రింటుతో కక్కూర్తి పడకుండా నెట్ ఫ్లిక్స్ లో దర్జాగా రాజులా రాజు బాహుబలిని చూడొచ్చు. అది సంగతి.