Begin typing your search above and press return to search.

ఆ బాహుబ‌లికి ద‌ర్శ‌కులెవ‌రంటే?

By:  Tupaki Desk   |   2 Aug 2018 6:48 PM IST
ఆ బాహుబ‌లికి ద‌ర్శ‌కులెవ‌రంటే?
X
బాహుబ‌లి రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకొన్న విష‌యం తెలిసిందే. అయితే రెండో చిత్రం విడుద‌ల‌యిన‌ప్ప‌ట్నుంచి మ‌రో సీక్వెల్ గురించి చ‌ర్చ మొద‌లైంది. మూడో బాహుబ‌లి కూడా ఉంటుంద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. రాజ‌మౌళి త‌న‌కి మూడో బాహుబ‌లి చిత్రం తీసే ఆలోచ‌నేదీ లేద‌ని ఓపెన్‌గా చెప్పినా దాని గురించి చ‌ర్చ ఆగ‌లేదు. రాజ‌మౌళి ఎప్పుడో ఒక‌సారి బాహుబ‌లి3 తీస్తాడ‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో బ‌లంగా ఉంది. అయితే ఆ చిత్రం ఉంటుందో లేదో కానీ... ఒక‌టో బాహుబ‌లి చిత్రానికి ముందు క‌థ మాత్రం తెర‌కెక్కుతోంది. అంటే దీన్ని సినిమా భాష‌లో ప్రీక్వెల్ అంటార‌న్న‌మాట‌. బాహుబ‌లి ది బిగినింగ్ కంటే ముందు ఏం జ‌రిగింద‌నే క‌థ‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

అయితే అది సినిమా రూపంలో రాదు. బుల్లితెర‌పైన విడుద‌ల కాబోతోంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ నెట్ వ‌ర్క్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇండియా `బిఫోర్ బాహుబ‌లి ది బిగినింగ్‌` పేరుతో తొమ్మిది ఎపిసోడ్ల సీరియ‌ల్ నిర్మించ‌బోతోంది. దానికి యువ ద‌ర్శ‌కులు దేవా క‌ట్టా - ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. శివ‌గామి పాత్ర‌ని బేస్ చేసుకొనే ఆ సీరియ‌ల్ రూపొంద‌బోతోంది. తిరుగుబాటు ల‌క్ష‌ణాలు - ప్రతీకారంతో ర‌గిలిపోయే ఓ అమ్మాయి తెలివైన మరియు అసమానమైన రాణిగా ఎలా మారింద‌నే క‌థ‌తో ఆ సీరియ‌ల్ రూపొందబోతున్న‌ట్టు స‌మాచారం. బుల్లితెర‌కోస‌మే అయినా.. భారీ బ‌డ్జెట్‌తో ఈ సీరియ‌ల్‌ని రూపొందించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.