Begin typing your search above and press return to search.

లోక‌ల్ మార్కెట్లో ఆ ఓటీటీ పెత్త‌నం చెల్ల‌దు!

By:  Tupaki Desk   |   30 Jan 2022 1:00 PM IST
లోక‌ల్ మార్కెట్లో ఆ ఓటీటీ పెత్త‌నం చెల్ల‌దు!
X
ఓటీటీ హ‌వాకు ఎదురేలేని సీజ‌న్ ఇది. స్మార్ట్ యుగంలో ఎంట‌ర్ టైన్ మెంట్ హ‌వా న‌డుస్తోంది. భ‌విష్య‌త్ ఎంట‌ర్ టైన్ మెంట్ అంతా ఓటీటీ దే కావ‌డంతో కార్పోరేట్ కంపెనీలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేయ‌డంలో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నెట్ ప్లిక్స్..అమెజాన్ ప్రైమ్ వీడియోస్..డిస్నీ హాట్ స్టార్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌లు భార‌తీయ మార్కెట్ లో దూసుకుపోతున్నాయి. కొత్త కొత్త ఫీచ‌ర్లు.. ఆఫ‌ర్ల‌తో స‌బ్ స్క్రిప్ష‌న్ పెంచుకుంటున్నాయి. అయితే ఇండియా మార్కెట్ లో డీస్నీ హాట్ స్టార్.. అమెజాన్ ప్రైమ్ కంటే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ నెట్ ప్లిక్స్ సంస్థ వెనుక‌బ‌డే ఉంది. ఇండియాలో నెట్ ప్లిక్స్ కేవ‌లం 5.5 మిలియ‌న్ల మంది స‌బ్ స్క్రిప్ష‌న్ ల‌ను మాత్ర‌మే క‌లిగి ఉంది.

డిస్నీ హాట్ స్టార్ 49 మిలియ‌న్లు.. ఆమెజాన్ కు 19 మిలియ‌న్ స‌బ్ స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఆ రెండింటితో పోల్చితే నెట్ ప్లిక్స్ భార‌తీయ మార్కెట్ లో ఎంత‌గా వెనుకబ‌డి ఉందో అర్థ‌మ‌వుతోంది. అయితే నెట్ ప్లిక్స్ ప్రారంభం నుంచి కంటెంట్ మీద మాత్ర‌మే ఫోక‌స్ పెట్టింది. స‌భ్య‌త్వాలను పొంద‌డం కంటే క్వాలిటీ కంటెంట్... విష‌యం ఉన్న కంటెంట్ నే అందించాల‌ని ముందుకు సాగుతోంది. అలాగే నెట్ ప్లిక్స్ స‌బ్ స్క్రిప్ష‌న్ ధ‌ర మ‌ధ్య త‌ర‌గ‌తికి అందుబాటులో లేదు. ఇందులో సబ్ స్క్రిప్ష‌న్ తీసుకోవ‌డం ఖ‌రీదైన వ్య‌వ‌హార‌మే. ఇందులో ఎలాంటి ఆఫ‌ర్లు ఉండ‌వు. కంటెంట్ ప‌రంగాను యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న కంటెంట్ నే ప్ర‌సారం చేస్తుంది.

నెట్ ప్లిక్స్ పూర్తి భిన్నంగా అమెజాన్.. డిస్నీ హాట్ స్టార్లు కొన‌సాగుతున్నాయి. వీటి ధ‌ర‌లు అంద‌రికీ అందుబాటులో ఉంటాయి. భార‌తీయ సినిమాల్ని ఎక్కువ‌గా ప్ర‌సారం చేస్తున్నాయి. ఈ రెండు సంస్థ‌ల ప్ర‌ధాన ఆదాయం ఇండియ‌న్ కంటెంట్ నుంచే వ‌స్తుంది. క‌స్ట‌మ‌ర్ల‌కు స‌బ్ స్క్రిప్ష‌న్ ప‌రంగా భారం కాదు. మ‌రి నెట్ ప్లిక్స్ భార‌తీయ‌ మార్కెట్ లో దూసుకుపోవాలంటే వ్యూహం మార్చ‌క త‌ప్ప‌దు. అలాగే అమెజాన్... డిస్నీ హాట్ స్టార్ల‌ను నెట్ ప్లిక్స్ ఇప్ప‌టివ‌ర‌కూ పోటీగా భావించింది లేదు.