Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: టాలీవుడ్ లో నెప్టోయిజం?

By:  Tupaki Desk   |   24 Nov 2019 11:08 AM GMT
ట్రెండీ టాక్‌: టాలీవుడ్ లో నెప్టోయిజం?
X
పోటీ ప్ర‌పంచంలో రాజ‌కీయాలు.. కుట్ర‌ల గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. అందునా న‌ట‌వార‌స‌త్వం రాజ్య‌మేలే సినీప‌రిశ్ర‌మ‌లో ఇలాంటివి ఇంకా ఎక్కువ‌గా ఉంటాయ‌ని చెబుతుంటారు. ఈ త‌ర‌హా స‌మ‌స్య‌ల‌పై బాలీవుడ్ లో కంగ‌న ర‌నౌత్.. తాప్సీ ప‌న్ను.. స్వ‌రా భాస్క‌ర్ లాంటి నాయిక‌లు నిరంత‌రం గొంతెత్తుతూనే ఉన్నారు. కెరీర్ ఆరంభంలో త‌మ‌కు ఎదురైన నెప్టోయిజం స‌మ‌స్య‌ల్ని కూడా ఈ భామ‌లు బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. న‌ట‌వార‌సుల‌కు ఉన్న ప్రోత్సాహం కొత్త‌వారికి ఉండ‌ద‌ని సూటిగానే విమ‌ర్శించారు. కంగ‌న అయితే ఆరంభ కెరీర్ లో త‌న‌ను ఇబ్బంది పెట్టిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. హీరోల్ని ఇటీవ‌ల అట‌కాయించ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇక న‌ట‌వార‌స‌త్వం (నెప్టోయిజం) విష‌యంలో టాలీవుడ్ ప‌రిస్థితి ఎలా ఉంది? అన్న‌ది విశ్లేషిస్తే బాలీవుడ్ తో పోలిస్తే ఇక్క‌డ ఆ స‌మ‌స్య అంత తీవ్రంగా లేద‌నే తాజా ప‌రిణామం చెబుతోంది. స్టార్ హీరోలు .. అగ్ర నిర్మాత‌ల నుంచి న‌వ‌త‌రం హీరోల‌కు స‌పోర్ట్ ద‌క్కుతోంది. ప్ర‌తిభ‌కు త‌గ్గ‌ట్టే అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తున్నారు. ఇక ఇరుగు పొరుగు బావుంటేనే మ‌నం కూడా బావుంటాం అనే గొప్ప క‌ల్చ‌ర్ మ‌న‌కు ఉంది. మ‌న హీరోల మంచి మ‌న‌సు గురించి ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణంపైనా ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. స్టార్ హీరోలే న‌వ‌త‌రం హీరోల‌ భుజం త‌ట్టి విజ‌యం సాధించాల‌ని ప్రోత్స‌హిస్తున్నారు. సినిమాల‌కు ప్ర‌చారం చేసి పెడుతున్నారు. బ‌న్ని.. చ‌ర‌ణ్‌.. మ‌హేష్.. తార‌క్.. ప్ర‌భాస్.. రానా లాంటి పెద్ద‌ స్టార్లు విజ‌యం సాధించిన హీరోల‌ను అభినందిస్తూ మోర‌ల్ స‌పోర్ట్ ని ఇస్తున్నారు.

కొత్త హీరోలు... చిన్న హీరోల్ని ఎంక‌రేజ్ చేయ‌డం అనే గొప్ప క‌ల్చ‌ర్ టాలీవుడ్ లో ఎప్ప‌టినుంచో వుంది. చిరంజీవి..నాగార్జున‌..వెంక‌టేష్... వీళ్లంతా కొత్త హీరోల్ని.. చిన్న హీరోల్ని వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించ‌డంపైనా పాజిటివిటీ పైనా నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. బ‌డా హీరోలు అంతా ప‌రిశ్ర‌మ బాగుండాల‌ని కోరుకుంటున్నారు. అంతేనా అభిమానుల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చినా.. త‌మ‌ను ఆద‌రించిన ప్ర‌జ‌లు ప్ర‌కృతి వైప‌రీత్యాల వ‌ల్ల క‌ష్టాల్లో ఉన్నా ఆదుకుంటున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే స్పందించి ఆర్థిక స‌హాయాన్ని అందిస్తున్నారు. అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఇది శుభ ప‌రిణామం అనే చెప్పాలి.