Begin typing your search above and press return to search.

వీడియో : ఈ సామి సామి రచ్చ పక్క దేశంలో అంటే నమ్ముతారా!

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:35 AM GMT
వీడియో : ఈ సామి సామి రచ్చ పక్క దేశంలో అంటే నమ్ముతారా!
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్‌ ప్రారంభం అయ్యింది. ఓటీటీ లో స్ట్రీమింగ్ మొదలు అయిన తర్వాత కూడా థియేటర్‌ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో పుష్ప సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. ఇక నేపాల్ లో కూడా పుష్ప హిందీ వర్షన్ ను భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. అక్కడ ఇప్పటి వరకు సౌత్‌ డబ్బింగ్ సినిమాలు పెద్దగా విడుదల అవ్వలేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో పుష్ప సినిమా నేపాల్ లో సందడి చేసింది. నేపాల్‌ నుండి మంచి షేర్‌ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. వసూళ్ల విషయం పక్కన పెడితే నేపాల్‌ లో అల్లు అర్జున్‌ పుష్ప ను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

పుష్ప సినిమా లోని సామి సామి పాట తో పాటు అన్ని పాటలను కూడా నేపాలీ సినీ అభిమానులు తెగ ఆస్వాదిస్తున్నారు. థియేటర్‌ లో పాటలు వచ్చిన సమయంలో వారు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సాదారణంగా స్టార్‌ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో సినిమా పెద్ద సక్సెస్ అయినప్పుడు థియేటర్లలో డాన్స్ లు వేస్తారు. లేదంటే విడుదల రోజు స్క్రీన్‌ ముందు రచ్చ చేస్తారు. కాని పుష్ప సినిమా కు నేపాలీ సినీ అభిమానులు అంతకు మించి అన్నట్లుగా రచ్చ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు ప్రతి పాటకు కూడా ఇలా డాన్స్ లు వేయడం ను చూస్తుంటే వారికి సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ వీడియో చూస్తుంటే ఏదో తెలుగు రాష్ట్రంలోని థియేటర్ అయ్యి ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. పక్క దేశంలో పుష్ప సందడి అంటే నిజమేనా అన్నట్లుగా అనిపించేలా వీళ్ల హడావుడి ఉంది. నేపాలీ థియేటర్ లో సామి సామి పాటకు ఇది పరిస్థితి అన్నట్లుగా ఒక నెటిజన్‌ వీడియోను షేర్‌ చేయగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ స్పందించాడు. వావ్‌ అంటూ లవ్‌ ఈమోజీలు మరియు దండం పెట్టినట్లుగా ఈమోజీని షేర్‌ చేశాడు.

దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం పుష్ప విజయంలో కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర భాషల్లో సినిమాను డబ్బింగ్‌ చేసిన సమయంలో పాటల విషయమై పెద్దగా శ్రద్ద పెట్టరు. కాని దేవి శ్రీ ప్రసాద్‌ డబ్బింగ్‌ వర్షన్‌ లకు కూడా స్టార్‌ సింగ్స్ తో పాడించాడు. తద్వారా నాచురాలిటీ మిస్ అవ్వకుండా డబ్బింగ్ సినిమా పాటలు అనే అభిప్రాయం కలుగకుండా హిందీ పుష్ప పాటలు వచ్చాయి. అందుకే హిందీ ప్రేక్షకులు అయినా నేపాలీ సినీ ప్రియులు అయినా ఇతర భాష లకు చెందిన వారు అయినా పుష్ప పాటలను ఆస్వాదిస్తున్నారు. అందుకు సాక్ష్యం ఈ వీడియో అనడంలో సందేహం లేదు. కొన్ని లక్షల రీల్స్ కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పుష్ప పాటలకు గాను రావడం మనం ఇన్‌ స్టా లో చూడవచ్చు. కనుక ఇతర భాషల్లో పుష్ప సక్సెస్ కు సంగీతం ఒక ప్రథాన అంశం అనడం లో సందేహం లేదు.