Begin typing your search above and press return to search.

డేట్ మారింది అంతే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా..!

By:  Tupaki Desk   |   4 Sep 2022 3:16 AM GMT
డేట్ మారింది అంతే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా..!
X
'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వచ్చిన 'ఎస్ఆర్ కళ్యాణమండపం' చిత్రంతో కమర్షియల్ సక్సెస్ అందుకొని వరుస అవకాశాలు అందుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 'సెబాస్టియన్' & 'సమ్మతమే' చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. ఇప్పుడు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అంటూ వస్తున్నాడు.

NMBK చిత్రానికి 'ఎస్ఆర్ కల్యాణ మండపం' ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు. ఇందులో కిరణ్ అబ్బావరం సరసన సంజనా ఆనంద్ మరియు సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. కాకపోతే ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా ఓ వారం ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

''నేను మీకు బాగా కావాల్సినవాడిని'' చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. దీనికి తగ్గట్టుగానే జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని తదుపరి వారానికి వాయిదా వేశారు. సెప్టెంబర్ 16వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెప్టెంబర్ 9వ తేదీన పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర: శివ' తో పాటుగా 'ఒకే ఒక జీవితం' చిత్రం థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు 'నేను మీకు కావాల్సిన వాడిని' వెనక్కి వెళ్లడంతో బాక్సాఫీస్ బరిలో రెండు క్రేజీ చిత్రాలు మాత్రమే నిలవబోతున్నాయి.

అయితే ఈ నెల 16న కిరణ్ కు సోలో రిలీజ్ డేట్ దొరికే అవకాశం లేదు. ఎందుకంటే అదే రోజున 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మరియు 'శాకిని డాకినీ' చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటికి ఒకరోజు ముందు 'లాఠీ' అనే డబ్బింగ్ సినిమా కూడా రాబోతోంది. ఇప్పుడు వీటితో పాటుగా 'నేను మీకు కావాల్సిన వాడిని' చిత్రం కూడా రిలీజ్ ప్లాన్ చేసుకుంది.

మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన NMBK సినిమాలో కిరణ్ అబ్బవరం మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీ రిజల్ట్ పై యువ హీరో పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ''డేట్ మారుతుంది అంతే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా'' అని కిరణ్ ట్వీట్ చేసాడు.

'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాకి కిరణ్ స్వయంగా స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. నరేష్ రెడ్డి మూలే సహ నిర్మాతగా వ్యవహరించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. రాజ్ నల్లి సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేసారు. ఈ సినిమా కిరణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.