Begin typing your search above and press return to search.

మూడు రోజుల్లో 15 కోట్ల షేర్.. 24 కోట్ల గ్రాస్‌

By:  Tupaki Desk   |   6 Feb 2017 5:51 PM GMT
మూడు రోజుల్లో 15 కోట్ల షేర్.. 24 కోట్ల గ్రాస్‌
X
నేచుర‌ల్ స్టార్ నాని త‌న బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు. అత‌డి కొత్త సినిమా ‘నేను లోక‌ల్’ ఓపెనింగ్స్ లో అద‌ర‌గొట్టేసింది. తొలి వారాంతంలో క‌లెక్ష‌న్లు కుమ్మేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.15 కోట్ల షేర్.. రూ.24 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం అనూహ్య‌మే. రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే ఈ చిత్రం తొలి వారాంతంలో రూ.11 కోట్ల‌కు పైగా షేర్ క‌లెక్ట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు అమెరికాలోనూ ‘నేను లోక‌ల్’ దుమ్ముదులిపింది. అక్క‌డ ఫ‌స్ట్ వీకెండ్లోనే ముప్పావు మిలియ‌న్ డాల‌ర్ల మార్కును అందుకుంది ఈ చిత్రం. క‌ర్ణాట‌క‌లోనూ షేర్ కోటి దాటింది. దిల్ రాజుకు ప‌ట్టున్న నైజాం ఏరియాలో ఈ సినిమాకు థియేట‌ర్లు బాగా దొర‌క‌డంతో ఇక్క‌డ అనూహ్యంగా రూ.4.34 కోట్ల ఫ‌స్ట్ వీకెండ్ షేర్ వ‌చ్చింది.
ఏరియాల వారీగా ‘నేను లోక‌ల్’ ఫ‌స్ట్ వీకెండ్ షేర్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం-రూ.4.34 కోట్లు
సీడెడ్‌-రూ.1.45 కోట్లు
వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.1.42 కోట్లు
గుంటూరు-రూ.89 ల‌క్ష‌లు
కృష్ణా- రూ.85 ల‌క్ష‌లు
ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.66 ల‌క్ష‌లు
తూర్పు గోదావ‌రి- 1.02 కోట్లు
నెల్లూరు-రూ.35 ల‌క్ష‌లు
క‌ర్ణాట‌క‌-రూ.1.15 కోట్లు
రెస్టాఫ్ ఇండియా-రూ.60 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌- రూ.2.25 కోట్లు
మొత్తం షేర్- రూ.15.04 కోట్లు