Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్ : రెజీనా 'నేనే నా..?' ఇంట్రెస్టింగ్‌

By:  Tupaki Desk   |   18 Aug 2021 6:52 AM GMT
ఫస్ట్‌ లుక్ : రెజీనా నేనే నా..? ఇంట్రెస్టింగ్‌
X
హాట్ బ్యూటీ రెజీనా ముఖ్య పాత్రలో తెరకెక్కిన 'నేనే నా..?' సినిమా ఫస్ట్‌ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రెజీనా ఒక అస్థి పంజరంను చాలా జాగ్రత్తగా సీరియస్ గా పరీక్షిస్తున్న ఈ ఫస్ట్‌ లుక్‌ సినిమాపై ఆసక్తిని కలుగజేస్తుంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. రెజీనా ఆఫీసర్‌ గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రెజీనా ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనను తాను నిరూపించుకుంది. ఈ సినిమాతో మరోసారి ఆమె తన సత్తాను చాటుతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఈమద్య కాలంలో రెజీనా కమర్షియల్‌ సినిమాలు కాస్త తగ్గించింది. చిన్నా చితకా ఆఫర్లకు కమిట్‌ అవ్వకుండా ప్రస్తుతం కాస్త పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే ఓకే చేస్తూ వచ్చింది. యాక్షన్‌ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు మంచి కాన్సెప్ట్‌ సినిమాలను కమిట్‌ అవుతున్న రెజీనాకు ఈ సినిమా మరింత స్టార్‌ డమ్‌ ను గుర్తింపును తెచ్చి పెడుతుంది. ఈమద్య కాలంలో అన్ని ఇండస్ట్రీల్లో కూడా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. మంచి కాన్సెప్ట్‌ తో పాటు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటే స్టార్‌ హీరోల సినిమాల రేంజ్ లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా మంచి వసూళ్లను దక్కించుకుంటున్నాయి. కనుక నేనేనా సినిమా కూడా తప్పకుండా మంచి సినిమా గా నిలుస్తుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

కార్తీక్‌ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రాజ్ శేఖర్‌ వర్మ నిర్మించాడు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందించగా గోకుల్ బెనోయ్‌ డీఓపీ అందిస్తున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రెజీనా మరియు వెన్నెల కిషోర్‌ ల కాంబోలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ఫస్ట్‌ లుక్ వచ్చిన తర్వాత సినిమా పై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. థియేటర్లు ఓపెన్‌ ఉన్నాయి కనుక ఈ సినిమాను అతి త్వరలోనే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో చూడాలి.