Begin typing your search above and press return to search.

త‌మిళ్ 'జెర్సీ' కి డైరెక్ట‌ర్ దొరికాడు

By:  Tupaki Desk   |   20 July 2019 3:28 PM GMT
త‌మిళ్ జెర్సీ కి డైరెక్ట‌ర్ దొరికాడు
X
వరుస సినిమాల‌తో రానా నిర్మాత‌గా బిజీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. హీరోగా న‌టిస్తూనే నిర్మాత‌గా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని నిర్మిస్తున్నాడు. తెలుగులో కొన్నిటికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌చారం ప‌రంగానూ సాయం చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌తో పాటు త‌మిళం- హిందీలోనూ సినిమాల నిర్మాణానికి రెడీ అవుతున్నాడు.

పొరుగు భాష‌ల్లో స‌క్సెస్ ద‌క్కించుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న తెలుగు హిట్ సినిమాల్ని క్యాచ్ చేస్తున్నాడు. అలా ఇప్ప‌టికే రెండు రీమేక్ ల‌కు ప్లాన్ చేశాడు రానా. తొలిగా ఓ బేబి (మిస్ గ్రానీ) హిందీ రీమేక్ కి ప్లాన్ సిద్ధ‌మైంది. ఆ సినిమా గురించిన చ‌ర్చ‌లు సాగుతుండ‌గానే త‌మిళంలో `జెర్సీ` రీమేక్ గురించిన ఆలోచ‌న‌లు చేయ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. నాని హీరోగా న‌టించిన జెర్సీ తెలుగులో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ఇందులో క‌థానాయిక‌. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

త‌మిళ వెర్ష‌న్ కి కాస్ట్ అండ్‌ క్రూని ఎంపిక చేస్తున్నారు. జెర్సీ త‌మిళ రీమేక్ లో విష్ణు విశాల్ హీరోగా న‌టిస్తాడ‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. ఇటీవ‌లే నిర్మాత రానా క‌థానాయ‌కుడిని ఫైన‌ల్ చేశారు. తాజాగా ద‌ర్శ‌కుడిని కూడా వెతికార‌ని తెలుస్తోంది. `మాన్ స్ట‌ర్`(ఎస్‌.జె.సూర్య‌) చిత్రంతో హిట్ అందుకున్న నెల్స‌న్ వెంక‌టేష‌న్ `జెర్సీ` త‌మిళ రీమేక్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. ఇక‌ క‌థానాయిక‌ను వెతకాల్సి ఉంది. హీరో విష్ణు విశాల్ స్వ‌త‌హాగానే క్రికెట్ తో ట‌చ్ ఉన్న హీరో కాబ‌ట్టి అత‌డు జెర్సీ కోసం ప్ర‌త్యేకించి శిక్ష‌ణ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డం క‌లిసి రానుంది. ఇక జెర్సీ చిత్రాన్ని హిందీలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించ‌నున్న సంగ‌తి విదిత‌మే.