Begin typing your search above and press return to search.

పుష్ప పై మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   15 Jan 2022 4:38 AM GMT
పుష్ప పై మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ కామెంట్స్‌
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా పై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. టీం ఇండియా క్రికెటర్‌ లు మొదలుకుని బాలీవుడ్‌.. కోలీవుడ్‌.. శాండిల్‌ వుడ్‌.. రాజకీయ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్క రంగానికి చెందిన ప్రముఖులు పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ మరియు సుకుమార్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారను. తాజాగా కోలీవుడ్‌ మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్ గా పేరు దక్కించుని సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో ప్రస్తుతం బీస్ట్‌ సినిమా చేస్తున్న నెల్సన్‌ దిలీప్‌ పుష్ప పై తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు.

పుష్ప సినిమా అద్బుతంగా ఉందంటూ నెల్సన్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్‌ నటన బాగుందన్నాడు. ఇలాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు అన్నట్లుగా నెల్సన్ ట్వీట్‌ చేసి పుష్ప సినిమా స్థాయిని మరింతగా పెంచాడు. నెల్సన్‌ ట్వీట్‌ కు అల్లు అర్జున్‌ స్పందించాడు. మీకు నా నటన నచ్చడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ డాక్టర్ సినిమా చాలా బాగుంది. ఈమద్య కాలంలో నాకు నచ్చిన సినిమా మీ డాక్టర్ అన్నట్లుగా అల్లు అర్జున్‌ నెల్సన్‌ ట్వీట్‌ కు రిప్లై ఇచ్చాడు. ఈమద్య కాలంలో ఒక్క సినిమా గురించి ఇంతగా ప్రశంసలు దక్కడం చాలా అరుదుగా చూస్తున్నాం. ఈ స్థాయిలో ప్రముఖులు ఒక సినిమా గురించి స్పందించడం అంటే ఖచ్చితంగా చాలా చాలా స్పెషల్‌ అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్‌ నటన గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

అల్లు అర్జున్‌ నటన జాతీయ స్థాయి అవార్డును తెచ్చి పెట్టే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. పుష్ప సినిమా 2021 సంవత్సరంలో విడుదల అయిన ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మూవీగా నిలిచింది. మొత్తం 300 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంటే కేవలం బాలీవుడ్‌ లో 80 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుని రికార్డుల వర్షం కురిపించింది. అద్బుత వసూళ్లకు ఒక వైపు కాగా అంతకు మించి అన్నట్లుగా సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కడం మరో వైపు. పుష్ప సినిమా అల్లు అర్జున్‌ కెరీర్‌ లో ఒక బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం అంతా కూడా పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ను త్వరలో ప్రారంభించి ఇదే ఏడాది డిసెంబర్‌ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.