Begin typing your search above and press return to search.

వర్మ మదర్స్ డే విషెష్.. ఇలా కూడా చెబుతారా?

By:  Tupaki Desk   |   11 May 2020 10:00 PM IST
వర్మ మదర్స్ డే విషెష్.. ఇలా కూడా చెబుతారా?
X
రాంగోపాల్ వర్మ.. వివాదాలు లేనిదే పొద్దుగడవని వర్మ ఎప్పుడూ ఏదో ఒకదాన్ని కెలికి మరీ కాంట్రావర్సినీ క్రియేట్ చేస్తాడు. అందులో అందరినీ ఇన్ వాల్వ్ చేసి సెగ కాగుతుంటాడు. తన పర బేధ లేకుండా అందరిపై వ్యంగ్యంగా పంచులేస్తూ ట్రెండింగ్ లో ఉంటాడు..

తాజాగా అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులకు శుభాకాంక్షలను కూడా తనదైన శైలిలో చెప్పి అందరికీ షాకిచ్చాడు. ‘మా అమ్మ చాలా మంచి తల్లి అని.. కానీ నేను మాత్రం దుర్మార్గపు కొడుకుని.. కాబట్టి ఇప్పటికీ మా అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జస్ట్ ఆస్కింగ్’ అంటూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తనను తానే దుర్మార్గుడిని అని సోషల్ మీడియాలో వర్మ ప్రకటించేసుకోవడం విశేషంగా మారింది.

ఇక తనలాంటి దుర్మార్గుడే మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు.. మరి ఒసామా బిన్ లాడ్, హిట్లర్, కిమ్ జాంగ్ ఉన్, డొనాల్డ్ ట్రంప్ లు తమ తల్లులకు తెలియజేశారా.? జస్ట్ ఆస్కింగ్.. వర్మ వ్యంగ్యంగా దెప్పి పొడిచాడు..

ఇలా మాతృదినోత్సవాన్ని కూడా తన వివాదాలకు.. కామెడీకి వినియోగించుకున్న వర్మది బుర్రే బుర్ర అంటూ అందరూ నీకో దండం నాయనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.