Begin typing your search above and press return to search.

ప్రభాస్‌-మురుగదాస్‌.. సరికొత్త 'అవతార్‌'

By:  Tupaki Desk   |   14 Aug 2015 7:11 AM GMT
ప్రభాస్‌-మురుగదాస్‌.. సరికొత్త అవతార్‌
X
ప్రభాస్‌ నటించిన బాహుబలి రికార్డుల వేట సాగిస్తూనే ఉందింకా. ఇప్పటికీ ఇంటా బైటా దుమ్ము రేపేస్తోంది ఈ చిత్రం. 600కోట్లు దాటి వసూళ్లు సాధించిన ప్రాంతీయ సినిమా ఇది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి విజయం సాధించడాన్ని కలలో కూడా ఊహించలేం. అయితే ఇది ప్రభాస్‌-రాజమౌళి డేర్‌ స్టెప్‌ వల్లే సాధ్యమైంది. అందుకే ఇప్పుడు ప్రపంచం కళ్లన్నీ ప్రభాస్‌ పైనే ఉన్నాయి. ప్రభాస్‌ గ్రాఫ్‌ ని అమాంతం పెంచేసే ఓ ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ గురించి మంతనాలు సాగుతున్నాయట.

బాహుబలుడు ప్రభాస్‌ హీరోగా ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు సాగుతున్నాయని ఇటీవలి ఓ ఇన్సిడెంట్‌ రివీల్‌ చేసింది. ప్రభాస్‌ బాహుబలి పార్ట్‌ 2 తర్వాత ఓ లార్జర్‌ దేన్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ లో నటించనున్నాడు. ఇదో ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లర్‌ మూవీ. ఈ చిత్రంలో రెండో లీడ్‌ లో నటించేందుకు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ని మురుగదాస్‌ కలిశారు. ఆ సంగతిని ఈ బాలీవుడ్‌ నటుడు స్వయంగా రివీల్‌ చేశాడు.

మురుగదాస్‌ తో కలిసి ప్రభాస్‌ సోదరుడు నన్ను ఇదివరకే కలిశారు. ముంబైలో డిన్నర్‌ చేస్తూ మాట్లాడుకున్నాం. సౌత్‌ లో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. ముఖ్యంగా తెలుగు నుంచి వచ్చే అనువాద చిత్రాలు రెగ్యులర్‌ గా చూస్తుంటా. తెలుగు సినిమా స్క్రీన్‌ ప్లే లు బావుంటాయి. కొత్త ఎటెంప్ట్‌ చేస్తున్నారని ప్రశంసించాడు. ప్రభాస్‌ గొప్ప నటుడని ఆకాశానికెత్తేశాడు.

ఈ మాటల్ని బట్టి మురుగదాస్‌ దర్శకత్వంలో ప్రభాస్‌-నీల్‌ నితిన్‌ కలయికలో ఓ త్రిభాషా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే ఈ ప్రాజెక్టు గురించి డిష్కసన్‌ చాలా ఎర్లీ అవుతుంది. అధికారిక వివరాల కోసం వెయిట్‌ చేయాల్సిందే.