Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరో

By:  Tupaki Desk   |   1 Jun 2017 7:21 AM GMT
ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరో
X
బాహుబలి 2 తరువాత ప్రభాస్ చేయబోయే ‘సాహో’ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. బాహుబలి తో ప్రభాస్ నేషనల్ లెవెల్ హీరో అయ్యాడు. పెద్ద బ్రాండ్లు, బహు భాషల సినిమాలు తో ఇప్పుడు ప్రభాస్ కొత్త అవతారం ఎత్తాడు. అందుకోసమే ఇప్పుడు సాహోలో నటులును కూడా దేశం మొత్తం పరిచయం ఉన్న నటులును తీసుకొని తమిళ్ హింది లో కూడా విడుదల చేయబోతున్నారు.

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ 'సాహో'లో ప్రతినాయకుడిగా చేస్తునట్లు తెలిసింది. హీరో గా మొదలుపెట్టి ఇప్పుడు విలన్ గా చేస్తున్నఇతను ప్రభాస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం కాబోతున్నాడు. ఇతను నిజానికి మెగాస్టార్ చిరంజీవి చేసిన ఖైదీ నెం 150 ఒరిజినల్ వర్షన్ లో విలన్ గా చేశాడు కాని.. తెలుగు వర్షన్ కు హ్యాండిచ్చాడు. విజయ్ కు విలన్ గా చేసి తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో ప్రభాస్ తో కలిసి విలన్ గా చేసి.. ఎలా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కాబట్టి.. దేశం మొత్తం కనిపించబోతున్నాడు.

సాహో ని నేషనల్ సినిమాగా మనం భావించవచ్చు ఎందుకంటే దేశంలో ఎక్కువ భాగం విడుదల అవుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే ఒక అంచనాలు ఉన్నాయి ఇప్పుడు దానితోబాటుగా బహు భాషల నటులు కలిసి కనువిందు చేస్తే సినిమాకు మరింత కొత్తదనం వస్తుందిని చెప్పాలి. ఇప్పుడు దేశం లో కొత్తరకం విలన్లు రావడంతో సినిమా కు మంచి ప్లస్ అవుతుంది. ఈ సినిమాకు కూడా నీల్ చేయడం వలన సరికొత్త మార్కెట్ రాబోతుంది అనుకోవచ్చు. ఇక హీరోయిన్ మ్యాటర్ ఏంటో ఇంకా ఫైనల్ కాలేదు. కొత్తగా పూజా హెగ్డే పేరు వినిపించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/