Begin typing your search above and press return to search.
మరో భారీ సినిమాలో సాహో స్టార్!
By: Tupaki Desk | 6 May 2020 6:30 PM ISTచైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నీల్ నితిన్ ముఖేష్. 2007లో వచ్చిన ‘జానీ గద్దర్’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఈ యంగ్ స్టర్ టాలీవుడ్ లోకి డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సాహో' సినిమాతో అడుగుపెట్టాడు. సాహో సినిమాలో మంచి నటనతో సినీ ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇంతవరకు తెలుగులో ఏ సినిమాను ఓకే చేయలేదు. అయితే తాజాగా నీల్ నితిన్ తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు దక్షణాది చిత్రాలను చిన్న చూపు చూసిన బాలీవుడ్ తారలు ప్రస్తుతం దక్షణాది చిత్రాల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీనే గొప్పది అని ఫీలయినవాళ్లే ఇప్పుడు టాలీవుడ్ సినిమాలలో అవకాశాల కోసం క్యూ కడుతున్నారు. తెలుగులో తెరకెక్కుతోన్న స్టార్ హీరోల సినిమాల అన్నింటిలోనూ బాలీవుడ్ నటులు తళుక్కుమంటున్నారు. నీల్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం 'బైపాస్ రోడ్'తో సహా తన బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు, తాజా నివేదికల ప్రకారం, నీల్ తన రెండవ తెలుగు చిత్రానికి సంతకం చేసాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత జూన్ నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. నీల్ ఈ చిత్రం గురించి వివరాలు త్వరలో బయటపడతాయని చెప్పాడు.